Advertisement
Google Ads BL

నాగ్ పర్మిషన్ తో అఖిల్ వాడేశాడు..!


హైదరాబాద్ మెట్రో రైల్ పనులు  మొదలుపెట్టి చాలాకాలమే అయ్యింది. అయితే ఈ మెట్రో 2015 నాటికీ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు 2017  వచ్చినా కూడా మెట్రో పనులు పూర్తి స్థాయిలో పూర్తి కావడంలేదు. ఇకపోతే కొన్ని లైన్లు మెట్రోకు పూర్తయి ట్రయిల్ రన్ వేసినా కూడా అక్కడ కూడా మెట్రో ఇంతవరకు స్టార్ట్ కాలేదు. ఇంకా కొన్ని చోట్ల మెట్రో పనులు నత్తనడకన సాగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అసలు ఇప్పుడు ఈ మెట్రో గురించి ఇంతిలా మాట్లాడుకోవడానికి ఒక కారణం వుంది. 

Advertisement
CJ Advs

అదేమిటంటే అక్కినేని అఖిల్ తన రెండో చిత్రాన్ని విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్ళిపోయాడు. పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టేసి పూర్తి దృష్టిని కెరీర్ మీద ఫోకస్ చేసాడు అఖిల్. అందుకే యమా జోరుగా షూటింగ్ చేసుకుంటూ శరవేగంగా దూసుకుపోతున్నాడు అఖిల్. ఇప్పుడు తన కొత్త చిత్రానికి సంబంధించి.... అఖిల్ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యాక్టీవ్ గా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు హాలీవుడ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ బాబ్ స‌మ‌క్షంలో తెర‌కెక్కించిన పోరాట స‌న్నివేశంలో అఖిల్ ఈ మెట్రో ప్రాజెక్ట్ ని ఉపయోగించుకున్నాడు. కదులుతున్న మెట్రో రైల్లో ఈ పోరాట స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. ప్ర‌ఖ్యాత హాలీవుడ్ ఫైట్ కొరియోగ్రాఫ‌ర్.. ఐర‌న్ మ్యాన్, కెప్టెన్ అమెరికా లాంటి భారీ యాక్ష‌న్ సినిమాల‌కు ప‌నిచేసిన లెజెండ‌రీ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ బాబ్ బ్రౌన్ ఈ చిత్రానికి  స్టంట్స్ అందించారు.

దానికి సంబంధించి ఒక ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.... లెజెండ‌రీ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్‌ని పరిచయం చేస్తున్నా. వ‌న్ అండ్ ఓన్లీ బాబ్ బ్రౌన్‌. కిక్కాస్ గ‌య్‌.. విత్ కిక్కాస్ టీమ్‌ అని క్యాప్షన్ పెట్టాడు. మరి మెట్రో రైల్ పూర్తి కాకుండానే అందులో అఖిల్ షూటింగ్ చేసేసాడు. అయితే ఇదంతా నాగార్జున వల్లే సాధ్యమైందట. హైదరాబాద్ లో తనకున్న పరిచయాలతో నాగ్ ఈ మెట్రో ట్రైన్ లో షూటింగ్ జరుపుకునేందుకు పర్మిషన్ తీసుకున్నాడని చెబుతున్నారు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన హీరోయిన్ గా ఎవరు ఇంతవరకు సెట్ కాలేదు.

Nagarjuna Taking Permission, Akhil Using Hyderabad Metro:

Akhil Using Hyderabad Metro. 'Introducing my legend of an action director. The one and only Bob Brown. Kickass guy with a kickass team. Half way through only coz of you !,' Akhil expressed his delight through his twitter handle.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs