Advertisement
Google Ads BL

మరోసారి నోరు జారిన అలీ..!


స్వతహాగా జోవియల్‌గా ఉండే అలీ ఈమధ్య టీవీ షోలు, పలు పెద్ద పెద్ద చిత్రాల వేడుకలకు యాంకరింగ్‌, హోస్టింగ్‌ కూడా చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఆయన కామెడీ కోసం వేసే పంచ్‌లు, జోకులు వివాదాలకు కారణమవుతున్నాయి. అంతకు ముందు ఓ వేడుకలో హీరోయిన్ల నడుము గురించి కామెంట్స్‌ చేశాడు. ఇక ఆ మధ్య యాంకర్‌ సుమ మీద సెటైర్‌ వేశాడు. ఇవి బాగా వివాదమైపోయాయి. దాంతో వారు ఆయన్ను లెఫ్ట్‌ అండ్‌ రైట్‌ వాయించారు. దాదాపు క్షమాపణలు చెప్పేదాకా పరిస్థితులు వెళ్లాయి. 

Advertisement
CJ Advs

ఇక యూట్యూబ్‌ ద్వారా ఆశా అనే అమ్మాయి అయితే అలీకి వార్నింగ్‌ సైతం ఇచ్చింది. అవి లైవ్‌ ప్రొగ్రామ్స్‌ అని, వాటిని కుటుంబ సమేతంగా చూస్తారని అలీకి తెలియదా...! ఇలాంటివి మరలా జరిగాయంటే బుద్ది చెప్పాల్సివుంటుందని వార్నింగ్‌ కూడా ఇచ్చింది. కాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శక జీవితం ఆధారంగా వస్తున్న ఓ కార్యక్రమానికి అలీ వచ్చాడు. సుమ ఆయన్ను మిమ్మల్ని హీరోగా పెట్టి ఇప్పుడు సినిమా తీయాలంటే హీరోయిన్‌గా ప్రస్తుతం ఉన్న సమంత, కాజల్‌, రకుల్‌ వంటి వారిలో ఎవరిని ఎంచుకుంటారు? అని ప్రశ్నించింది. 

దానికి అలీ ఠక్కున్న సమంత అని చెప్పాడు. ఎందువల్ల అని సుమ అడిగితే సమంత అయితే సమ్మగా ఉంటుంది.. అన్నాడు. వెంటనే పాత సంఘటనలు గుర్తుకొచ్చాయేమో సర్దుకుని,.. సమంత భలే నటిస్తుంది. శ్రీదేవిని దిగ్గొట్టి పొట్టిగా చేస్తే సమంత అవుతుంది. రకుల్‌, కాజల్‌ వంటి వారు మనకి సరిపోరు.. సమంత అయితే ఓకే అని మరోసారి వివాదం పెద్దది కాకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. 

Comedian Ali once again Tongue Slipped :

Ali Sensational Comments on Samantha in K Raghavendra rao Show. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs