ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో మోహన్‌లాల్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డుగ్రహీత వాసుదేవనాయర్ రచించిన 'రండమూజం' ఆధారంగా ప్రముఖ యాడ్ మేకర్ అండ్ డైరెక్టర్ శ్రీకుమార్‌మీనన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. దుబాయ్‌లో స్ధిరపడిన ప్రముఖ పారిశ్రామిక వేత్త బి.ఆర్.శెట్టి ఈ 1000కోట్ల ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాడు. ఇంతటి అద్భుతానికి ఆయన తెరతీయడం నిజంగా అభినందనీయం.
కాగా భీముని కోణంలో జరిగే మహాభారతంలో భీముని పాత్రను ది గ్రేట్ మోహన్‌లాల్ పోషిస్తున్నాడు. ఇండియాలోని పలు భాషల్లోనే కాక ఇంగ్లీషుతో పాటు పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇక దేశంలోని పలు భాషా నటీనటులు నటించే అవకాశం ఉంది. ఇక శ్రీకృష్ణుని పాత్రకు ప్రస్తుతం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్‌రోషన్‌ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. కాగా 2018 సెప్టెంబర్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్‌ను రెండు భాగాలుగా 2020 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.