Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపిస్తాడట..!


ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ 'జై లవ కుశ'. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.... బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. మూడు పాత్రలు విభిన్నమైనవి కాడంతో ఈ చిత్రంపైనా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇపుడున్న యూత్ హీరోలలో ఎన్టీఆర్ మొదటిసారి మూడు పాత్రల్లో కనిపించనున్న హీరోగా సంచలనం సృష్టిస్తున్నాడు. అయితే ఆ మూడు పాత్రలు ఎలా వుంటాయో అనే దానిమీద ఎన్టీఆర్ అభిమానులతోపాటు సామాన్య ప్రేక్షకుడు కూడా ఎంతో ఉత్కంటతో ఉన్నారు.

Advertisement
CJ Advs

ఇక ఎన్టీఆర్ మూడు పాత్రలు ఇవే అంటూ సోషల్ మీడియాలో లీకైన ఫొటోస్ బట్టి రక రకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇందులో జై పాత్రలో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ లో కనబడతాడని... లవ బ్యాంక్ మేనేజర్ పాత్రలో కనిపిస్తాడని.... ఇక మిగిలి కుశ నాటకాలు వేసుకుంటూ చాలా జోవియల్ గా ఉంటాడనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ కుశ పాత్ర నాటకాలు వేసుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే పాత్రగా చెబుతున్నారు. ఇక ఈ మూడు కేరెక్టర్స్ లో ఎన్టీఆర్ తన విశ్వరూపం చూపిస్తాడని కూడా అంటున్నారు. 

ఇక ఈ ముగ్గురు ఎన్టీఆర్ లు చిన్నప్పుడే విడిపోతారని... మళ్లీ కొన్ని కారణాలతో వీరు ముగ్గురు పెద్దయ్యాక కలుస్తారని స్టోరీ లైన్ గా చెబుతున్నారు. అయితే ఈ స్టోరీ లైన్ నిజమా ? లేక కల్పితమా? అన్నది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వెయిట్ చెయ్యాల్సిందే. ఇక 'జై లవ కుశ' చిత్రంలో ఎన్టీఆర్ రెండు పాత్రలకు జోడీలుగా రాశి ఖన్నా, నివేత థామస్ లు నటిస్తున్నారు.  విశ్వం 

Jr NTR showing Multiple shades of Talent...!:

jr ntr new movie jai lava kusa. ntr three characters acted this movie.these are characters, negative shades,bank manager and doing dramas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs