Advertisement
Google Ads BL

రకుల్‌ మాయ చేస్తోంది..!


'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'తో గుర్తింపు తెచ్చుకున్న భామ రకుల్‌ప్రీత్‌సింగ్‌. కాగా తనతోపాటే పరిచయమైన పలువురు హీరోయిన్లను లభించని అదృష్టం ఈ ఢిల్లీ భామను వరించింది. ఒక్కసారిగా స్టార్‌హీరోయిన్‌ అయిపోయింది. కానీ పలువురు స్టార్స్‌తో ఆమె చేసిన చిత్రాలు పెద్దగా ఆడకపోయసరికి ఇక ఆమె పనైపోయిందనే ప్రచారం జరిగింది. కానీ ఇంతలోనే మరలా రేసులోకి వచ్చింది. పలువురు దర్శకులను, హీరోలను మాయ చేస్తోంది. 

Advertisement
CJ Advs

సమంత వంటి వారు గ్లామర్‌పాత్రలకు సెలవ్‌ ఇవ్వడం ఈమెకు మరింతగా కలిసివచ్చింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'కిక్‌2'లో నటించింది. ఇక అదే సురేందర్‌రెడ్డి తదుపరి చిత్రం 'దృవ'లో అవకాశం సాధించింది. అంతకు ముందు చిత్రం 'బ్రూస్‌లీ'లో సైతం ఆమెతో ఆడిపాడిన చరణ్‌ కూడా 'దృవ'లో ఆమెకే ఓటు వేశాడు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో బన్నీతో 'సరైనోడు'లో నటించిన ఆమెను బోయపాటి తన తాజా చిత్రం బెల్లకొండ శ్రీనివాస్‌ చిత్రంలోనే ఆమెనే రిపీట్‌ చేశాడు. 

ప్రస్తుతం ఆమె నాగచైతన్యతో 'రారండోయ్‌ వేడుక చూద్దాం'తో పాటు మహేష్‌-మురుగదాస్‌ల 'స్పైడర్‌'లో నటిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఇక మురుగదాస్‌ ఆమె నటనకు ఫిదా అయిపోయి మహేష్‌ చిత్రం అనంతరం తాను విజయ్‌తో చేయబోయే చిత్రంలో కూడా ఆమెనే తీసుకోవాలని ఫిక్స్‌అయ్యాడట. మొత్తానికి రకుల్‌ మాత్రం మన దర్శకులను బాగానే మాయ చేస్తోందనే చెప్పాలి...!

Rakul Preet singh doing magic..!:

rakul preet singh is a top heroine in tollywood industry. rakul preet singh going top heroine list in venkatadri express movie rakul present acted movie rarandoy veduka chudam movie and mahesh babu, murugados combination movie spyder 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs