Advertisement
Google Ads BL

అఖిల్ ఆశలన్నీ అతని పైనే..!


ఎంతో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని. నాగార్జున కూడా ఎంతో రిచ్ గా గ్రాండ్ గా వి.వి వినాయక్ డైరెక్షన్ లో 'అఖిల్' తో ఎంట్రీ ఇప్పించాడు.  అయితే చేసిన మొదటి సినిమాతోనే ఘోరమైన ప్లాపుని మూట కట్టుకున్న అఖిల్ రెండో సినిమాని మొదలు పెట్టడానికే భయపడ్డాడు. అయితే నాగార్జున అఖిల్ ని మళ్లీ రీ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించగానే అఖిల్ రెండో సినిమా డైరెక్టర్స్ గా అనేక రకాల పేర్లు తెరమీదకి వచ్చాయి. కానీ చివరికి అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్, అఖిల్ రెండో సినిమా దర్శకుడిగా సెట్ అయ్యాడు. ఇక నాగార్జున తన సొంత బ్యానర్లోనే ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. నాగార్జున ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో జాగ్రత్తగా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

ఇక విక్రమ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో అఖిల్ తన రెండో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. అయితే ఇప్పుడు విక్రమ్ కుమార్ కి ఒక సెంటిమెంట్ బాగా అచ్చొచ్చిందని అందుకే అఖిల్ రెండో సినిమాకి ఆ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నాడనే ప్రచారం జరుగుతుంది. అదేమిటంటే విక్రమ్ తీసిన 'ఇష్క్' చిత్రంలో  సూర్యతో చేసిన '24' చిత్రంలో విలన్ గా నటించాడు అజయ్. ఇక ఆ రెండు చిత్రాలు హిట్ అవడంతో ఇప్పుడు విక్రమ్ అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ అజయ్ ని అఖిల్ చిత్రానికి కూడా విలన్ గా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. అసలే అఖిల్ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ విక్రమ్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి అఖిల్ కి హిట్ వస్తే అంతకన్నా ఏం కావాలి అక్కినేని ఫ్యామిలీకి.

Akhil Total Hopes On Director Vikram:

manam movie director vikram kumar. Akhil second movie director vikram kumar is final. akkineni family total hopes on director vikram kumar. vikram kumar is following one sentiment in akhil second movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs