Advertisement
Google Ads BL

పవన్‌, త్రివిక్రమ్‌ మూవీకి మరో రెండు..!


పవన్‌కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న హ్యాట్రిక్‌ మూవీకి సంబంధించి షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. రాబోయే ఎలక్షన్స్‌ నాటికి పూర్తి పొలిటికల్‌ లీడర్‌గా మారే క్రమంలో..ఈ కాస్త వ్యవధిలో వీలైనన్ని సినిమాలు చేయాలని పవన్‌కళ్యాణ్‌ భావిస్తున్న విషయం తెలిసిందే. అందువల్లే, ఎప్పుడూ లేని విధంగా పవన్‌ 'కాటమరాయుడు' పూర్తవ్వగానే త్రివిక్రమ్‌తో సినిమా షూటింగ్‌ని స్టార్ట్‌ చేశాడు. 

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాకి సంబంధించి రకరకాల టైటిల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే 'దేవుడే దిగివచ్చినా', 'ఇంజనీర్‌ బాబు' అనే టైటిల్స్‌ పాటు, పోస్టర్స్‌ కూడా సంచారం చేస్తున్న ఈ సినిమాకి తాజాగా మరో రెండు టైటిల్స్‌ యాడ్‌ అయ్యాయి. అవేమంటే 'పరదేశీ పరయానం, గోకుల కృష్ణుడు'. అయితే చిత్ర యూనిట్‌ నుండి మాత్రం ఇంత వరకు ఎటువంటి టైటిల్‌ బయటికి రాలేదు. 

ఈ మధ్య ప్రతి సినిమాకి ఇది కామన్‌ అయిపోయింది. మేకర్స్‌ కూడా ఈ టైటిల్స్‌ విని ఎంజాయ్‌ చేస్తున్నారు..తప్ప ఖండించడం లేదు. చివరికి ఇలాంటి వాటి నుండే ఏదో ఒక టైటిల్‌ని అనౌన్స్‌ చేస్తున్నారు. మరి పవన్‌, త్రివిక్రమ్‌ సినిమాకి ఏ టైటిల్‌ ఫైనల్‌ అవుతుందో..చూద్దాం..!

Two More Titles for Pawan and Trivikram Movie:

Two New Titles Paradesi Parayanam and Gokula Krishnudu for Pawan Kalyan and Trivikram's Film. Already Devude Digi Vachinaa and Engineer Babu were the titles which have been circulated on net so far.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs