భారతదేశంలో మొదటిసారి 1000 కోట్ల బడ్జెట్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రం రూపుదిద్దుకోబోతుంది. హైలీ టాలెంటెడ్ యాడ్ ఫిల్మ్ మేకర్ గా పేరున్న శ్రీకుమార్ ఆధ్వర్యంలో మహాద్భుతమైన 'ది మహాభారత’చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు,తమిళం, ఇంగ్లీష్ ,కన్నడ, మలయాళం భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈచిత్రానికి యూ.ఏ.ఈ కి చెందిన ఓ భారతీయ వ్యాపారవేత్త భారీ బడ్జెట్ పెట్టడానికి ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ చిత్రం రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ అతి పెద్ద భారీ ప్రాజెక్ట్ లో టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు చాలామంది నటీనటులు నటిస్తారని అంటున్నారు.
ప్రముఖ రచయిత ఎం.టి వాసుదేవన్ నాయర్ రాసిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్, మోహన్ లాల్ నటిస్తున్నాడని సమాచారం. ఓ హాలీవుడ్ డైరెక్టర్ నటీనటుల ఎంపిక చేయబోతున్నారని చెబుతున్నారు. భారతీయ సినీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా వెయ్యి కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ‘ది మహాభారత’ సినిమా రూపుదిద్దుకునేందుకు రంగం సిద్దమైంది. అయితే ఇండియాలో ఉన్న భాషల్లోనే కాకుండా ఇంకా కొన్ని విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని డబ్బింగ్ చేస్తారని చెబుతున్నారు.