సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో 'ధృవ' చిత్రంతో తిరుగులేని హిట్ అందుకున్న రామ్ చరణ్ తాజాగా సుకుమార్ డైరెక్షన్ లో పల్లెటూరి ప్రేమ కథ లో విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. అయితే 'ధృవ' లో రామ్ చరణ్ ని చాలా స్టైల్ గా చూపించాడు సురేందర్ రెడ్డి. ఇక 'ధృవ' చిత్రం హిట్ ఇచ్చినందుకుగాను రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కి తన తండ్రి 151 వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యతలు అప్పజెప్పాడు. ఇప్పుడు సుకుమార్ చిత్రంలో బాగా బిజీగా వున్న రామ్ చరణ్ ఈ వీకెండ్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి తన తండ్రి 151 చిత్రానికి గాను స్టోరీ డిస్కర్షన్స్ లో పాల్గొన్నాడట. అది కూడా రామ్ చరణ్ ఇంటిదగ్గర... సురేందర్ రెడ్డి తో కలిసి కూర్చుని ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథను విన్నాడట చరణ్. మరి ఎంతైనా చరణ్ తన తండ్రి 151 వ చిత్రానికి నిర్మాత కదా.
అయితే సురేందర్ రెడ్డి తనతోపాటు తన కొడుకులని కూడా చరణ్ ఇంటికి తీసుకురాగా వారిని రామ్ చరణ్ తన ఇంట్లో ఉన్న గుర్రం పై ఎక్కించి అటు ఇటూ తిప్పుతూ వారిని ఎత్తుకుని తెగ ఎంజాయ్ చేసాడు. సురేందర్ రెడ్డి పిల్లల్తో 'ధృవ' చిత్ర షూటింగ్ అప్పటినుండి బాగా సాన్నిహిత్యం పెంచుకున్న చరణ్ ఇప్పుడిలా వారితో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ సందర్భంగా తీసిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.