Advertisement
Google Ads BL

మెగా విలన్ అనే బిరుదు ఇచ్చేస్తారేమో!


ఆది పినిశెట్టి తెలుగులో హీరోగా పాపులర్ కాకపోయినా తమిళంలో మాత్రం చిన్న చితక సినిమాల్లో హీరోగా నటిస్తూ బాగానే బిజీగా వున్నాడు. అయితే గత ఏడాది బోయపాటి శ్రీను, ఆది పినిశెట్టిని అల్లు అర్జున్ కోసం విలన్ గా మార్చాడు. బోయపాటి - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సరైనోడు'లో అల్లు అర్జున్ పాత్ర అంత పవర్ ఫుల్ గా విలన్ రోల్ ని డిజైన్ చేసాడు బోయపాటి. ఆ రోల్ కి ఆది పినిశెట్టి అయితే బావుంటుందని అతనితో చర్చలు జరిపి విలన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇప్పించాడు. ఇక ఆ సినిమాలో ఆది విలన్ గా అదరగొట్టేసాడు. అల్లు  అర్జున్ పాత్రకి హీరోగా ఎంత పేరైతే వచ్చిందో ఆదికి విలన్ గా అంతే పేరొచ్చింది.

Advertisement
CJ Advs

ఆ సినిమా తర్వాత ఆది పినిశెట్టి మరో సినిమాకి విలన్ గా సైన్ చెయ్యలేదు. అయితే ఇపుడు మరో మెగా హీరో రామ్ చరణ్ చిత్రంలో ఆది పినిశెట్టి ఒక పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుందిగాని అది ఏ రోల్ అనేది ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ తాజా చిత్రంలో ఆది రోల్ కూడా నెగెటివ్ గా వుంటుందనే వార్త బయటకి వచ్చింది. ఇక ఇప్పటికే రామ్ చరణ్, సమంత, సుకుమార్ చిత్రం షూటింగ్ లో జాయిన్ కాగా ఇప్పుడు ఆది పినిశెట్టి కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడట.

ఇకపోతే ఆది పినిశెట్టి.. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ తాజా చిత్రంలో కూడా ఒక నెగెటివ్ రోల్ నటిస్తున్నాడని అంటున్నారు. మరి ఈ లెక్కన ఆది పినిశెట్టిని చూస్తుంటే  మెగా హీరోల కి విలన్ గా మారిపోయాడా అని అనిపిస్తుంది కదూ..!!

Aadi Pinisetty turned Villan for Mega Heroes:

Aadi Pinisetty Villan in Ram Charan and Pawan Kalyan Movies.  Aadi Pinisetty Sarainodu strategy Continuess..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs