తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ విషయంలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఆయన ఓ బాలీవుడ్ పత్రికా సంపాదకుడిని, సిబ్బందిని తనను స్టార్ అని పిలకుండా సూపర్‌స్టార్‌గా సంబోధించాలని నానా ఒత్తిడి తెచ్చాడట. ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. ఇక హీరోల బిరుదుల విషయానికి వస్తే బిరుదులను వారి వారి అభిమానులు పెట్టుకుంటారే గానీ.. అవేమీ పద్మశ్రీలు, భారతరత్నలు, దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్య అవార్డులు కావు. చిరంజీవిని మొదట్లో సుప్రీంహీరో అని అభిమానులు ముద్దుగా బిరుదు పెట్టారు. ఆ తర్వాత మెగాస్టార్‌గా మార్చారు. మరికొందరు భజన పరులు మెచో మెగాస్టార్ అని పెట్టారు. కానీ ఈ బిరుదు పెద్దగా ఎవ్వరినీ ఆకర్షించలేదు. దాంతో ఇప్పటికీ మెగాస్టార్‌గానే పిలుస్తున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే రెండు హిట్స్ రాగానే తనను జూనియర్ అని పిలవవద్దని, కేవలం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అని పిలవాలని ఒత్తిడి చేశాడు. ప్రిన్స్‌గా పిలువబడే మహేష్‌కు క్రేజ్ రాగానే ఆయన పేషీ నుంచి, పీఆర్వోల నుంచి ఇక నుంచి మహేష్‌ని సూపర్‌స్టార్ అని పిలవాలనే ఒత్తిడి వచ్చింది. నాగార్జున తనకు వయసు మీరడంతో ఇక తనను యువసమ్రాట్ అని పిలవవద్దని చెప్పాడు. ఇందులో అర్ధం ఉంది. కానీ ఆయన తనను 'కింగ్' అని పిలవాలని, నాగచైతన్యను 'యువసమ్రాట్' అని పిలవమని ఓ ఉచిత సలహా ఇచ్చాడు. ఇక రజనీని సూపర్‌స్టార్ అంటారు. అమితాబ్‌ను బిగ్‌బి అని, బాద్‌షా అని, మెగాస్టార్ అని కూడా సంబోదిస్తుంటారు. మోహన్‌లాల్‌ని మలయాళంలో సూపర్‌స్టార్, మెగాస్టార్ అని పిలుస్తారు. కానీ ఇక్కడ వారిని మీడియా అలా పిలిస్తే చిరు, మహేష్ వంటి వారి ప్యాన్స్ మండిపడుతున్నారు.
కన్నడలో రాజ్‌కుమార్ తనయుడిని పవర్‌స్టార్ అని పిలుస్తారు. ఒక బాలకృష్ణను ఒకప్పుడు యువరత్న అని, ఆ తర్వాత బాక్సాఫీస్ బొనాంజా, నందమూరి నటసింహం అన్నారు. తాజాగా ఆయన తనకు తానుగా తనను ఇక నుంచి బసవతారక రామ పుత్ర అని పిలవాలని సందేశం ఇచ్చాడు. ఓకే.. ఎవరి ఇష్టం వారిది. కానీ మీడియాలో అలాగే రాయాలని ఒత్తిడి చేయడం మాత్రం తప్పు.