Advertisement
Google Ads BL

మెగాహీరోలకు గైడెన్స్‌ లేదా...?


కొత్తతరం మెగాఫ్యామిలీ హీరోలుగా పరిచయమైన సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌లు తమ కెరీర్‌లో కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి తానే హీరోగా బిజీ అయ్యాడు. ఇక ఆయన రాజకీయాలతో పాటు తన చిత్రాలు, తన కుమారుడైన రామ్‌చరణ్‌ చిత్రాల ఎంపిక, కొణిదెల ప్రొడక్షన్స్‌ బేనర్‌ని నిలబెట్టే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇక అల్లుఅరవింద్‌ సంగతి తెలిసిందే. తన గీతాఆర్ట్జ్‌ కుమారులైన అల్లుఅర్జున్‌, అల్లు శిరీష్‌లను బిజీ చేయడంలో లీనమైపోయాడు. 

Advertisement
CJ Advs

ఇక బన్నీ వాసు నిర్మాతగా రెండో బేనర్‌లో మరిన్ని చిన్న చిత్రాలను ప్లాన్‌ చేస్తూ ఉన్నాడు. ఇక పవన్‌ విషయానికి వస్తే ఆయన తన చిత్రాల ఎంపికలోనే తప్పులు చేస్తున్నాడు. రాజకీయంగా బిజీ అయ్యాడు. సో.. ఇప్పుడు మెగాఫ్యామిలీ హీరోలైన సాయిధరమ్‌తేజ్‌, వరుణ్‌తేజ్‌లకు గైడెన్స్‌ ఎవరు ఇస్తున్నారు? అనే సందేహాలు వస్తున్నాయి. సాయిని పరిచయం చేసే సమయంలో పవన్‌ ఆయనకు బాగా సహాయం చేశాడు. చివరకు సాయి దిల్‌రాజు గైడెన్స్‌లో బాగానే పనిచేశాడు. 

కానీ తన సొంత నిర్ణయాలైన 'తిక్క, విన్నర్‌'లతో ఆయన సత్తా కూడా బయటపడింది. 'శతమానం భవతి' అనే అవార్డు చిత్రాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు 'జవాన్‌' చేస్తూ, మరోవైపు దిల్‌రాజుతోనే 'శ్రీనివాస కళ్యాణం' అనే చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. కానీ ఎప్పుడు బిజీగా ఉండే దిల్‌రాజు సాయికి ఎంతో కాలం గైడ్‌ చేయకపోవచ్చు. ఇక వరుణ్‌తేజ్‌ తండ్రి నాగబాబు నిర్మాతగా ఫెయిల్‌ అయ్యాడు. 'రుద్రవీణ' వంటి అవార్డు చిత్రం నిర్మించినా ఆయన మెగాహీరోలైన చిరు, పవన్‌లు సోదరులే అయినా దానిని సరిగ్గా క్యాష్‌ చేసుకోలేకపోయాడు. ఒకటి అర చిత్రాలు తప్ప అన్నీ లాస్‌ వెంచర్సే. తన కూతురు నిహారిక మొదటి చిత్రాన్ని కూడా జడ్జ్‌ చేయలేకపోయాడు. దీంతో ఇప్పుడు వరుణ్‌తేజ్‌కి కూడా ఇబ్బందులు ఏర్పడి వరుస పరాజయాలు ఎదురవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు...! 

No guidance to mega heroes..?:

mega heroes sai dharam tej and varun tej waiting for guidance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs