ఒకప్పుడు హీరోలుగా చేసిన కొంతమంది ఇప్పుడు విలన్స్ గా టర్న్ తీసుకుని సినిమాల్లోనే కొనసాగుతున్నారు. అలాగే హీరోయిన్స్ భర్తలు కూడా సినిమాల్లో ఒకమాదిరి పొజిషన్ లో వున్నవారు కూడా విలన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇపుడు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే స్నేహ గుర్తుండేవుంటుంది కదా. ఒకప్పుడు హీరోయిన్ గా వున్న ఆమెకి.. తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో మాత్రం మంచి అవకాశాలతో దూసుకుపోతున్న టైమ్ లో ప్రసన్న ని పెళ్లి చేసుకుని ఒక బాబుకి జన్మని కూడా ఇచ్చింది. అయినా ఇంకా సినిమాల్లో కేరెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూనే వుంది.
ఇక ఇప్పుడు స్నేహ భర్త ప్రసన్న, సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాలో విలన్ గా నటిస్తున్నాడని సమాచారం. విలన్ గా ఫ్రెష్ ఫేస్ వెతుకుతున్న సాయి.. డైరెక్టర్ కి స్నేహ భర్త అయితే బావుంటాడని అనిపించి ప్రసన్న ని సంప్రదించినట్టు చెబుతున్నారు. ప్రసన్న కూడా తమిళంలో కొన్ని సినిమాల్లో హీరోగా నటించి ఇప్పుడు కేరెక్టర్ ఆర్టిస్ట్ గా వున్నాడు. ఇక ఈ ప్రపోజల్ కి ప్రసన్న కూడా ఒకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం మొత్తం వెనుక స్నేహ హస్తం వున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే తమిళంలో ప్రసన్న కు అవకాశాలు తగ్గడంతో ఇలా తెలుగులో వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని స్నేహ ఇచ్చిన సలహాతో ప్రసన్న దీనికి ఒకే చెప్పాడని అంటున్నారు.