సినిమా కథలను జడ్జ్ చేయడంలో నేడున్న నిర్మాతల్లో దిల్‌రాజు రూటే సపరేట్. ఆయన నిర్మించిన చిత్రాలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయనేకంటే.. ఆయన ఖచ్చితంగా విజయవంతం అయ్యే చిత్రాలనే చేస్తాడని చెప్పుకుంటే బాగుంటుంది. ఇక డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా మారిన ఆయన ఓ డబ్ చిత్రంతోనే ప్రారంభించాడు. ఇక ఇటీవలి కాలంలో తీసుకుంటే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం' మినహా ఆయన తీసుకున్న డబ్బింగ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. విజయ్ నటించిన 'తేరీ' చిత్రాన్ని ఆయన 'పోలీస్'గా అనువాదం చేశాడు. ఇక 'రెమో' కూడా అదే కోవలోకి వస్తుంది.
తాజాగా మణిరత్నం చిత్రం 'చెలియా' పెద్ద దెబ్బేసింది. ఇక డైరెక్ట్ చిత్రాలను, కొత్త దర్శకుల కథలను సరిగ్గా అంచనా వేసుకోగలిగిన దిల్‌రాజు డబ్బింగ్ చిత్రాల విషయంలో తొందరపడుతున్నాడా? అనే అనుమానం రాకమానదు. కాగా దిల్‌రాజు కి ఈ చిత్రాల వల్ల నష్టం వచ్చిందనేది నిజం కాదని, ఆయన ఆయా సినిమాలను డబ్బిచ్చి అనువాదం చేసుకోలేదని,.. కేవలం తన బేనర్ పేరును వాడుకున్నాడని సమాచారం. అందుకుగాను ఆయనకు భారీగానే గుడ్‌విల్ కింద అందిందట. నిజమే అయి ఉండవచ్చు. కానీ ఫ్లాప్ చిత్రాలను ఆయన గుడ్‌విల్ డబ్బు కోసం డబ్ చేయడానికి ఒప్పుకుంటే నిర్మాతగా ఆయన బేనర్‌కు, ఆయనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కు పెద్ద దెబ్బ పడే అవకాశం అయితే వుంది.