సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు ఎంత సన్నిహితుడో చెప్పనక్కరలేదు. కాగా మోహన్‌బాబు కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన 'పెదరాయుడు' చిత్రంలో రజనీని లేకుండా మనం ఆ సినిమానే ఊహించలేం. ఆయన క్యారెక్టర్‌కు ఆ చిత్రం అంతగా పేరుతెచ్చి... సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి, అందులోనూ తాను ఓ పవర్‌ఫుల్ పాత్రను చేయడానికి రజనీనే కారణం. కాగా ఈరోజు తమిళ ఉగాది సందర్భంగా తమిళనాడులో 'పవర్‌పాండీ' విడుదలైంది. ఈ చిత్రానికి తమిళనాడులో ముందుగానే ప్రీమియర్‌షోలు వేశారు.
అందరు ఆ చిత్రం సూపర్ అంటున్నారు. కాగా ఈ చిత్రాన్ని తన మామ రజనీ కోసం ధనుష్ స్పెషల్‌షో వేశాడు. దీనికి రజనీ మోహన్‌బాబును కూడా ఆహ్వానించాడని సమాచారం. ఈ చిత్రం చూసిన తర్వాత రజనీతో పాటు మోహన్‌బాబు కూడా ధనుష్‌ను పొగడ్తలతో ముంచెత్తారట. మరో 10ఏళ్లు ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుందని, ఆ చిత్రం ద్వారా వచ్చే పేరును చెడగొట్టుకోవద్దని ధనుష్ కు సలహా ఇచ్చినట్లు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని తెలుగులో మోహన్‌బాబును రీమేక్ చేయమని రజనీ సలహా ఇచ్చాడంటున్నారు. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేయలేదని చెబుతున్నారు.