Advertisement
Google Ads BL

పవన్ మళ్లీ దాని గురించే మాట్లాడాడు..!


పవన్‌ తాజాగా మరోసారి దక్షిణాదిపై ఉత్తరాది వారు చూపిస్తున్న వివక్షతను ఎత్తిచూపిన సంగతి తెలిసిందే. ఇక అదే సమయంలో ఆయన ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న వైసీపీ ఎంపీలని పొగిడాడు. ఇక ఏపీ స్పెషల్‌ స్టేటస్‌కి అనుకూలంగా మాట్లాడిన కేశవరావుతో పాటు రాపోల్‌ ఆనందభాస్కర్‌ వంటి తెలంగాణ నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. దక్షిణాది, ఉత్తరాది తేడా గురించే మరలా మాట్లాడాడు. ఇక మనం చిన్ననాటి నుంచి 'భారతదేశము నామాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు...' అని చెప్పేవాళ్లం. 

Advertisement
CJ Advs

'జనగణమన.. వందేమాతరం' వంటి దేశజాతీయ గీతాలను, పాటలను నేర్చుకున్నాం.. కానీ పెద్దయిన తర్వాత వాస్తవ ప్రపంచంలోకి వచ్చి చూస్తే మాత్రం చిన్నప్పుడు మనం చదివిన, విన్నమాటలు నిజాలు కాకపోవడం బాధని కలిగిస్తోంది. తాజాగా ఉత్తరాది, దక్షిణాది తేడాల గురించి ఓ మేధావి వివరిస్తూ, దక్షిణ భారతదేశ రాష్ట్రాల నుంచి ఎంత మొత్తం కేంద్రానికి అందుతోంది. ఉత్తరాదికి మన దక్షిణాది వల్ల జరుగుతున్న మేలుతో పాటు, విదేశీ హస్తల నుంచి దేశాన్ని కాపాడేందుకు పాకిస్థాన్‌ సరిహధ్దులకు, అందుకు అవుతున్న రక్షణ ఖర్చులు, బంగ్లాదేశ్‌ నుంచే కాకుండా చైనా దగ్గర ఉండే ఈశాన్యరాష్ట్రాల అభివృద్దికి కేంద్రం ఎంతగా నిదులు ఇస్తోంది? అవ్వన్నీ దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చినవే కదా..! అంటూ అంకెలతో సహా చూపించాడు. 

కానీ మనం మన దేశం, మన కాశ్మీర్‌, మన రాష్ట్రాలు అనే దేశభక్తి భావనలోనే ఉన్నాం. కాబట్టి ఉత్తరాది వారు తామేదో పైనుంచి ఊడిపడిన వారు కాదనే విషయాన్ని తెలుసుకుని దక్షిణాదిపై, తెలుగు ప్రజలపై తమకున్న నిజాయితీని నిరూపించుకోవాల్సివుంది...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs