Advertisement
Google Ads BL

ధనుష్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందా..?


తమిళ నటుడు ఇప్పుడు తన తల్లితండ్రులు ఎవరు అనే విషయంపై కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యాడు. అసలు ధనుష్ మాములుగా నే రజినీకాంత్ అల్లుడిగా కాకుండా తన స్వశక్తి మీద పైకి వచ్చి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. అలాంటి ధనుష్ పరువుని  ఆ మధ్యన సుచి లీక్స్ రోడ్డున పడేశాయి. సుచిత్ర ఎన్ని వీడియోస్ లీక్ చేసినా కూడా ధనుష్ ఆ విషయంపై అసలు నోరు మెదపలేదు. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు ధనుష్ మరో సమస్యలో చిక్కుకున్నట్టు తమిళనాట ప్రచారం జరుగుతుంది. ప్రేమమ్ చిత్రంతో లైం టైంలోకి వచ్చిన సెబాస్టియన్ మడోన్నా, ధనుష్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ వినబడుతుంది. ,హద్దులు మీరు ప్రవర్తించవద్దు.... లేకపోతె మర్యాద ఉండదు, అని ధనుష్ కి సెబాస్టియన్ వార్నింగ్ మెసేజ్ పెట్టినట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరి అంతటి స్టార్ హీరోకి ఇంతటి కుర్ర హీరోయిన్ ఇలా హెచ్చరించడం ఇప్పుడు పెద్ద సంచలనం అయ్యింది.

అసలు మడోన్నా సెబాస్టియన్ అలా ధనుష్ కి వార్నింగ్ ఇవ్వడానికి కారణం కూడా చెబుతున్నారు. ధనుష్ ఫస్ట్ టైమ్ దర్శకుడిగా తెరకెక్కిస్తున్న 'పవర్ పాండి' చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న మడోన్నాకి ధనుష్ కి మధ్యన ఏవో విభేదాలు తలెత్తాయని.. ఆ విభేదాలు పెద్ద గొడవకి దారి తీసిందని... అందువలనే మడోన్నా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెడుతుందని చెబుతున్నారు. ఈ గొడవలు చిలికి చిలికి గాలి వానై వార్నింగ్ ఇచ్చే లెవెల్ కి వెళ్లిందని అంటున్నారు. మరి ఇన్ని సమస్యల నుండి ధనుష్ ఎలా బయట పడతాడో అని కోలీవుడ్ జనాలు చర్చించేసుకుంటున్నారు.   

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs