'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రాశి ఖన్నా.. కెరీర్ ఆరంభంలోనే రవి తేజతో 'బెంగాల్ టైగర్' లో నటించింది. ఇక రాశికి వెనుదిరిగి చూసుకొనే అవసరం లేదు అని అనుకున్నారు అంతా... కానీ రాశి ఖన్నా కు అనుకున్న ఆఫర్స్ రాలేదు. అందుకే చిన్న చిన్న హీరోలతో అడ్జెస్ట్ అవుతున్న రాశి ఖన్నా కు ఇప్పుడు ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో బంపర్ ఆఫర్ తగిలింది. అంతేకాకుండా రవితేజతో మరోమారు జోడి కట్టే అవకాశాన్ని చేజిక్కించుకుంది. అలాగే మలయాళంలో ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘విలన్’ లో కూడా ఒక కీలక పాత్రలో చేస్తుంది.
అయితే మోహన్ లాల్ చిత్రంలో రాశి ఖన్నా నెగెటివ్ షేడ్స్ వున్న పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందట. ఆ విషయాన్నీ రాశి నే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మరి మొదటిసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ లో నటించడమేకాకుండా మోహన్ లాల్ చిత్రం 'విలన్' కోసం సింగర్ గా కూడా మారిందట ఈ భామ. రాశి ఖన్నా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ కోసం సింగర్ అవతారమెత్తిందట. ఇప్పటికే ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తయిపోయిందని.... పాట చాలా బాగా వచ్చిందని చెబుతున్నారు.
ఇక ఈ విషయాన్ని కూడా రాశి స్వయంగా తెలిపింది. తన చిన్ననాటి నుండి ఒక పాట పాడాలని కోరిక ఉండేదని ఇప్పుడా కోరిక నెరవేరిందని... తన మలయాళ డెబ్యూ సినిమా కోసం టైటిల్ సాంగ్ పాడానని చెప్పింది. ఒకేసారి ఒకే సినిమా కోసం రాశి ఖన్నా రెండు విభిన్న అవతారాలెత్తింది కదా!!