Advertisement
Google Ads BL

సినిమా ఛాన్స్ కోసం ఆ పని చెయ్యాల్సిందేనట!


ఈ మాట అన్నది ఎవరో కాదు గోవా బ్యూటీ ఇలియానా. ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న ఇలియానా ... బాలీవుడ్ లో అవకాశం రాగానే అక్కడికి ఎగిరిపోయింది. అక్కడ ఏదో విధంగా పాదుకుపోదామని ట్రై చేసి ట్రై చేసి వర్కౌట్ అవ్వక ఇక్కడ తెలుగులో ఒకటో అర సినిమాల్లో నటించింది. అయితే ఇలియానా కి టాలీవుడ్ లో ఆఫర్స్ పెద్దగా రాలేదు. అయినప్పటికీ అమ్మడికి బాలీవుడ్ మీద మోజు తగ్గక ఇంకా  అవకాశాల కోసం ట్రై చేస్తూనే వుంది. ఇక ఆ మధ్యన టాలీవుడ్ అవకాశాల కోసం నేనెవరిని బ్రతిమిలాడనని తెగేసి చెప్పిన ఇల్లు బేబీ ఇప్పుడు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Advertisement
CJ Advs

ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మోలీవుడ్ అన్ని చోట్ల హీరోయిన్స్ ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి గొంతెత్తి విమర్శలకు దిగారు. ఇదే విషయాన్ని టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ దగ్గర నుండి బాలీవుడ్ కంగనా రనౌత్ వరకు ఒకే మాట మాట్లాడుతున్నారు. అవకాశాల కోసం నిర్మాతలు, హీరోల పడకగదిలోకి వెళ్లాల్సిందే అని తమకు ఎదురైనా అనుభవాలను చెబుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు గోవా బ్యూటీ ఇలియానా కూడా చేరింది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలియానా ఇండస్ట్రీలో ఉన్న ఈ చెత్త సంస్కృతి గురించి మాట్లాడింది. 

అవకాశాలు అందుకోవాలని ఇలాంటి ఉచ్చులో చాలా మంది హీరోయిన్స్ పడిపోయారని... ముఖ్యంగా టాప్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టెలయాలంటే ఖచ్చితంగా దర్శకనిర్మాతలు - హీరోల పడక గదుల్లోకి వెళ్లసిందే అని.. అప్పుడే వారికీ ఛాన్స్ లు వస్తాయని అంటుంది. అలాంటి వారు ఇండస్ట్రీలో చాలామందే వున్నారని చెబుతుంది. కానీ నేను మాత్రం అలాంటి చీప్ ట్రిక్స్ కి లొంగను.... కేవలం ఆఫర్స్ కోసం ఇలాంటి నీచమైన స్థితికి ఎట్టి పరిస్థితుల్లో దిగజారానని చెబుతుంది. నాకు వచ్చిన చాన్సుల్లోనే నటిస్తానని... కథ డిమాండ్ చేస్తేనే బికినీ ధరిస్తానని... ఆఫర్స్ కోసం అంగ ప్రదర్శన చేసే అవసరం తనకి లేదని చెబుతుంది. నేను అలా కాంప్రమైజ్ కాకపోవడం వలెనే నాకు ఆఫర్స్ రావడం లేదని చెబుతుంది. 

మరి ఇంతమంది టాప్ హీరోయిన్స్ ఇలా లైంగిక వేధింపులు గురించి గళమెత్తుతుంటే ఒక్క దర్శక నిర్మాత గాని హీరోలు గాని వాటిని ఖండించడం లేదు... అందుకే ఇలా రోజుకో హీరోయిన్ తెర మీదకి వచ్చి ఈ లైంగిక దాడుల గురించి నోరు విప్పుతున్నారు అని అంటున్నారు కొంతమంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs