Advertisement
Google Ads BL

తల్లి సెంటిమెంట్‌తో పవన్‌కి షాకివ్వనున్నారా...?


ఒకవైపు పవనేమో నాకు కులం, మతం నచ్చవంటాడు. మరోపక్క ఆయన మా కులం వాడని కాపులు, రెడ్డి మహాసభకు పిలుస్తామని మరికొందరు, కమ్మవాడినైనా కాపులకు న్యాయం చేసేది మేమే కాబట్టి.. పవన్‌ టిడిపికే మద్దతు ఇవ్వాలని కొందరు.. కాదు.. పవన్‌ ఈ స్థాయికి ఎదగడానికి ఆయన అన్నయ్య చిరునే కారణం కాబట్టి ఆయన తన అన్నయ్య ఉన్న కాంగ్రెస్‌లోనే ఉంటే బాగుంటుందని కొందరు.. ఇలా పవన్ ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలు చాలానే జరుగుతున్నాయి. వీటిలో పవన్‌ ఏదో ఒకదానికి లొంగకపోతాడా? అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా కొత్తగా వ్యవసాయశాఖా మంత్రిగా పదవి దక్కించుకున్న నెల్లూరు జిల్లా టిడిపి సీనియర్‌ నాయకుడు సోమిరెడ్డిచంద్రమోహన్‌రెడ్డి చిర, పవన్‌ల తల్లి అంజనాదేవిని కలిశాడు. చిరు, పవన్‌లు రాజకీయాలలోకి ఎంటరైనా కూడా ఆమె తల్లి ఇంతవరకు నోరు మెదపలేదు. ఇక నెల్లూరులో పవన్‌కి మంచి అభిమానులు ఉన్నారు. గత కొన్నివిడతలుగా సోమిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి వరుస పరాజయాలు పొందుతున్నాడు. దాంతో చివరకు ఆయన దొడ్డి దారిన ఎమ్మెల్సీ కావాల్సివచ్చింది. ఇప్పుడు తాను మంత్రిని కాబట్టి తల్లి సెంటిమెంట్‌తో పవన్‌ మద్దతును కూడగట్టాలనేది సోమిరెడ్డి వ్యూహంగా కొందరు చెబుతుండగా... సోమిరెడ్డి చంద్రబాబు ఆజ్ఞానుసారమే పవన్‌ తల్లిని కలిశాడని మరో వర్గం వారు వాదిస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs