Advertisement
Google Ads BL

మెగా హీరో లౌక్యంతో అదరగొడుతున్నాడు...!


మెగామేనల్లుడు సాయిదరమ్‌తేజ్‌ మొదటి నుంచి తన లౌక్యాన్ని చూపిస్తున్నాడు. ఈయన పవన్‌కి అత్యంత ఇష్టుడు కావడంతో పవన్‌ సొంత అభిమానులను కూడా ఆకర్షించాడు. ఇక మరో మేనమామ చిరుని, బన్నీ, చరణ్, మహేష్‌, ఎన్టీఆర్‌.. ఇలా అందరినీ తన లౌక్యంతో మంచి చేసుకున్నాడు. అక్కినేని వారి కాబోయే కోడలు సమంతను, రవితేజను కూడా ఈయన వదల్లేదు. 

Advertisement
CJ Advs

ఇక ఈయన కెరీర్‌కు మొదటి నుంచి స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు అండదండలు పుష్కళంగా ఉన్నాయి. 'సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్‌, సుప్రీమ్‌' వంటి చిత్రాలు చేశాడు. ఇక 'శతమానం భవతి' విషయంలో తప్పు చేసినందుకు బాధపడుతున్నాడు. కానీ ఇప్పుడు మరోసారి దిల్‌రాజును మచ్చిక చేసుకున్నాడు. 'శతమానం భవతి' చిత్రానికి నేషనల్‌ అవార్డు రావడంతో దిల్‌రాజును సన్మానించాడు. పనిలో పనిగా త్వరలో 'శతమానం..' దర్శకుడు సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వంలోనే దిల్‌రాజు నిర్మాతగా మరో ఫ్యామిలీ చిత్రం చేసి కుటుంబప్రేక్షకులకు చేరువకావడానికి ప్లాన్‌ చేస్తూ.. వావ్‌ అనిపిస్తున్నాడు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs