హాట్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ ఎప్పుడూ టాక్ అఫ్ ద ఇండస్ట్రీనే. యాంకరింగ్ లో హాట్ హాట్ గా కనిపిస్తూ అదే అదనుగా వెండితెర మీద కూడా అవకాశాలు పెట్టేస్తూ దూసుకుపోతుంది. 'క్షణం' సినిమాలో కీ రోల్ పోషించిన అనసూయ 'విన్నర్' సినిమాలో ఐటెం సాంగ్ లోచెలరేగిపోయింది. అయితే అనసూయ నాకు నచ్చితే ఏదైనా చేస్తానంటుంది. అందుకే ఐటెం సాంగ్ లో నటించానని చెబుతుంది. బుల్లితెర మీద క్షణం తీరిక లేకుండా గడుపుతున్న అనసూయ ఇప్పుడు వెండితెర మీద కూడా బాగా బిజీ అయ్యేట్టు కనబడుతుంది.
ఇప్పుడు అనసూయకి ఒక బంపర్ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చినట్లు చెబుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరమీదున్న చిత్రంలో అనసూయ కి ఒక రోల్ కన్ఫర్మ్ అయినట్లు ప్రచారం మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సమంత నటిస్తుండగా మరో ముఖ్య పాత్ర కోసం అనసూయని సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే సమంత షూటింగ్ లో జాయిన్ కాగా అనసూయ కూడా రేపోమాపో ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతున్నట్లు చెబుతున్నారు.
ఏది ఏమైనా అనసూయ కష్టం ఊరికే పోలేదు. ఆమధ్యన చాలా హాట్ హాట్ గా ఫోటో షూట్స్ చేయించుకుని డైరెక్టర్స్ కి, కుర్రకారుకి సవాల్ విసిరిన అనసూయకి హీరోయిన్ గా అయితే అవకాశాలు రాలేదు గాని ఇలా ఐటమ్స్ కి, స్పెషల్ రోల్స్ కి మాత్రం అవకాశాలు తెగ వచ్చేస్తున్నాయి. ఒకే ఏడాది ఇలా ఇద్దరి మెగా హీరోల సినిమాల్లో నటిస్తున్న అనసూయకి అదృష్టం బాగానే పట్టిందని చెప్పాలి.