ఈనెల 30న హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో జాతీయ రెడ్డి మహాసభను నిర్వహిస్తున్నామని, ఈ నేషనల్ రెడ్డి మహాగర్జనకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను ఆహానిస్తున్నామని ఈ సభ నిర్వాహకుడు సైకమ్ రామకృష్ణారెడ్డి సోషల్ మీడియాలో తెలిపాడు. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన సంస్థను ఆయన వైయస్సార్‌సీపీగా చెప్పుకున్నాడు. కానీ జగన్ వైయస్సార్‌సీపీకి మా వైయస్సార్‌సీపీగా సంబంధం లేదని, దీని పూర్తి పేరు 'యూత్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫర్ కామన్ పీపుల్' అని ఆయన తెలపడం విశేషం. కాగా తాను గతంలో జగన్ వైయస్సార్‌సీపీలో ఐటీ విభాగంలోనూ, సేవాదళ్‌లోనూ పనిచేశానని, వైసీపీలోని కొన్ని లోపాలను ఆయన ఎత్తిచూపుతూనే జగన్‌ను పరోక్షంగా ఆయన విమర్శించారు. మరోపక్క జగన్‌ను వచ్చే ఎన్నికల్లో సీఎంను చేయడమే తమ లక్ష్యమని తెలిపాడు.
ఇక రెడ్డి మహాసభకు పవన్‌ని ఎందుకు ఆహ్వానిస్తున్నాడో కూడా ఆయన తెలిపాడు. మెగా ఫ్యామిలీకి చెందిన అల్లుఅర్జున్, రామ్‌చరణ్‌తేజ్‌లు రెడ్డి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారని, అందుకే తాను ఆ ఫ్యామిలీకి చెందిన పవన్‌ని ఈ సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపాడు. మరి ఆయన చంద్రబాబు, బాలకృష్ణ వంటి వారిని ఎందుకు ఆహ్వానించలేదు..? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీకి చెందిన తారకరత్న కూడా ఓ రెడ్డి అమ్మాయినే వివాహం చేసుకున్న విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.