Advertisement
Google Ads BL

సుక్కు సంచలనం సృష్టించడం ఖాయం..!


విభిన్న చిత్రాలు తీసే దర్శకుడు సుకుమార్‌ ప్రస్తుతం 'నాన్నకు ప్రేమతో' తర్వాత రామ్‌చరణ్‌, సమంతలతో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో తాను నటిస్తున్న విషయాన్ని సమంత కూడా అఫీషియల్‌గా చెప్పింది. మరోపక్క ఈ చిత్రంలో చరణ్‌ లుక్‌ లీకై సంచలనం సృష్టిస్తోంది. 

Advertisement
CJ Advs

గుబురు గెడ్డంతో ఉన్న చరణ్‌ లుక్‌ని చూసి అందరూ షాకవుతున్నారు. ఇక సుక్కు చిత్రం అంటే అది సాధారణ ప్రేక్షకులకు పజిల్‌ వంటిదని అందరూ భావిస్తారు. ఈ చిత్రం కూడా టైమ్‌ ట్రావెలింగ్‌ సబ్జెక్ట్‌తో రూపొందుతోందని, ఇది ఓ సైన్స్‌ ఫిక్షన్‌ తరహా చిత్రమని వార్తలు వచ్చాయి. కానీ సుక్కు, చరణ్‌లు మాత్రం ఇది పక్కా గ్రామీణ కథా చిత్రమని చెప్పారు. ఎలాంటి లాజిక్కులు లేని సింపుల్‌ చిత్రమన్నారు. కాగా ఈ మూవీ 1980నాటి బ్యాగ్రౌండ్‌తో రూపొందుతోందని, ఇందులో హీరో రామ్‌చరణ్‌ చెవిటి వాడని, హీరోయిన్‌ సమంత మూగదిగా నటిస్తోందని సమాచారం. 

వాస్తవంగా ఇలాంటివి మనకు పార్‌లర్‌ చిత్రాలలో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఓ పక్కా కమర్షియల్‌ చిత్రంలో, అందునా టాలీవుడ్‌లో చరణ్‌తో చేయడమంటే సాహసమే. బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, శాండల్‌వుడ్‌లలో వచ్చే ఈ తరహా చిత్రం వస్తోందంటే కొత్త తరహా చిత్రాలను అభిమానించేవారికి ఇది తీపి వార్తేననిచెప్పాలి. హ్యాట్సాఫ్‌ టు సుక్కు, మైత్రిమూవీమేకర్స్‌, చరణ్‌ అండ్‌ సమంత....! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs