మెగాహీరోగా పరిచయమైన వరుణ్‌తేజ్ నటించిన 'ముకుంద, కంచె' చిత్రాలతో విభిన్న చిత్రాలు చేశాడు. ఇక పక్కా కమర్షియల్‌ఫార్టెట్‌లో ఆయన చేసిన లోఫర్ డిజాస్టర్ అయింది. కాగా మెగాహీరోలంటే కేరాఫ్ డ్యాన్స్‌స్టార్స్ అని చెప్పాలి. కానీ వరుణ్ అనే ఈ ఆరడుగుల బుల్టెట్ మాత్రం డ్యాన్స్‌ల్లో వీక్. ఆయన హైట్ కూడా దీనికి ఓ కారణం. ఈ విషయాన్ని ఆయనే ఒప్పుకున్నాడు. కాగా తాజాగా ఏప్రిల్14న శ్రీనువైట్ల కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతున్న'మిస్టర్' చిత్రంలో వరణ్ డ్యాన్స్‌ల కోసం తన పరిధిలో బాగానే కష్టపడ్డాడని అర్ధమవుతోంది. తనకు వచ్చిన కొద్దిపాటి డ్యాన్స్‌ను కొరియోగ్రాఫర్లు బాగా చేయించారని తెలిపాడు. మరి ఈ వీక్‌నెస్‌ను మెగాప్రిన్స్ అధిగమిస్తాడో లేదో చూడాలి...!