Advertisement
Google Ads BL

తెలంగాణలో మారుతున్న సమీకరణాలు..!


వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. పవన్‌కళ్యాణ్‌ జనసేనకు తెలంగాణలో ప్రజా యుద్దనౌక గద్దర్‌ నాయకత్వం వహించే అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇప్పటికే గద్దర్‌ కూడా నక్సలిజం నుంచి ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తున్నాడు.

Advertisement
CJ Advs

ఒకప్పుడు ఈ బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన గద్దర్‌ ఇప్పుడు ఆ భావాలకు దూరంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు వస్తున్నాడు. తనపై కాల్పులు జరిగి 20ఏళ్లూ అయిన సందర్భంగా ఆయన ఆ విషయాన్ని స్పష్టంగానే చెప్పాడు. ఇక ఆయన వచ్చే ఎన్నికల నాటికి పవన్‌ జనసేనకు సేనానిగా తెలంగాణలో ఉండటమే కాదు.. వామాపక్షాలను కూడా ఒకే తాటిపైకి తెస్తున్నాడు. ఇక తెలంగాణలో ఉనికిని కోల్పోతున్న టిడిపిలోని రేవంత్‌రెడ్డి, రమణ వంటి వారిని తమ వైపుకు తెచ్చుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

ఇక తెలంగాణలో బలపడాలని భావిస్తున్న బిజెపి ఇప్పటికే నాగం జనార్ధన్‌రెడ్డితో పాటు మొదట్లో బిజెపిలో ఉన్న విజయశాంతిని, సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా పనిచేసిన కిరణ్‌కుమార్‌రెడ్డికి మంచి స్నేహితుడైన మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ముఖచిత్రం మారనుంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs