నిన్న శుక్రవారం కేంద్రం 64వ జాతీయ సినిమా అవార్డులును ప్రకటించింది. ఈ అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’ ఎంపిక కాగా… 'రుస్తుం' సినిమాలో నటనకు అక్షయ్ కుమార్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ తమిళ చిత్రంగా జోకర్ ఎంపిక కాగా ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా, ఉత్తమ సామాజిక చిత్రం – పింక్ చిత్రాలను జాతీయ అవార్డులు వరించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ జాతీయ అవార్డుల ఎంపిక కమిటీ మీద తమిళ దర్శకుడు మురుగదాస్ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు. ఈ అవార్డుల ఎంపికను కొంతమంది విమర్శించినా మరికొంతమంది సమర్ధించారు. కానీ ఈ దర్శకుడు మాత్రం జ్యురి సభ్యులపై తీవ్రమైన ఆరోపణలను, ఆగ్రహాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. జ్యూరీ సభ్యులపై తీవ్ర ఒత్తిళ్లు ఉన్నట్టు ఈ అవార్డుల ఎంపిక బట్టి స్పష్టంగా అర్థమవుతోందని.... అవార్డుల ఎంపికలో పక్షపాత వైఖరి తేటతెల్లమవుతోందని ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసాడు.
మరి మురుగదాస్ ఇంతలా ఫైర్ అవ్వడానికి కారణమేమిటోగాని ఇప్పుడు మాత్రం ఆయన చేసిన ట్వీట్స్ వేడెక్కిస్తున్నాయి.