ఏప్రిల్ 8న టాలీవుడ్ స్టార్స్ ఒకేరోజున ముగ్గురు తమ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. వారిలో ఇద్దరు మెగా ఫ్యామిలీ వారు కాగా మరొకరు అక్కినేని హీరో. మెగా హీరో అల్లు అర్జున్ బర్త్ డే, పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా నందన్ పుట్టినరోజు ఒకేరోజు కావడం విశేషం. అలాగే అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ బర్త్ డే కూడా ఇదే రోజు. అయితే వీరి ముగ్గురు బర్త్ డేస్ కి మరో మెగా హీరో రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో నటించే ప్రేమ కథా చిత్రానికి గాను షూటింగ్ నిమిత్తం ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉంటున్నాడు. ఇక అక్కడ జరిగే షూటింగ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసే చరణ్ ఇప్పుడు ఈ ముగ్గురికి కలిపి ఒకేసారి విషెస్ చెప్పేసాడు. వారి ముగ్గురి ఫోటో పెట్టి ‘ఒకేరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా ప్రియమైన సోదరులు ముగ్గురికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఈ రోజు ఎంతో అద్భుతంగా.... ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాన’ని పోస్ట్ చేసాడు.