Advertisement
Google Ads BL

జెసి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి...!


జగన్‌కు తనపై కేసులు వచ్చినప్పుడు, తనకు ఇబ్బందులు ఏర్పడినప్పుడే డిల్లీ గుర్తుకొస్తుందని, దాంతో ఆయన సూట్‌కేసులు పట్టుకుని ఢిల్లీకి వెళ్తాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. నిజమే.. జగన్‌ తన కేసుల మాఫీ కోసం పలుసార్లు ప్రజాసమస్యలు, ఏపీప్రయోజనాలపై ఢిల్లీ వెళ్లాడు. ఇప్పుడు మరలా అతని బెయిల్‌పిటిషన్‌ను రద్దు చేయాలని, ఆయన తన కేసులోని పలువురిని ప్రభావితం చేస్తున్నాడని సిబిఐ కోర్టును ఆశ్రయించింది. పనిలో పనిగా ఈ పనిని అడ్డుకునే నెపంతో ఆయన వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపిలో మంత్రులుగా తీసుకోవడంపై ఢిల్లీ వెళ్లడనేది జెసి వాదన. 

Advertisement
CJ Advs

ఆయన ఢిల్లీలో తన బెయిల్‌ రద్దుకాకుండా ఉండేందుకు పలు పార్టీల నేతలను, ములాయం, సురవరం సుధాకర్‌రెడ్డి, రాజా వంటి వారిని కలవడానికి వెళ్లాడు. దీనిని జెసి తప్పుపట్టాడు. జగన్‌ రాష్ట్రపతికి కలిస్తే ఉపయోగం లేదని, ఆయన ఓ కప్పు కాఫీ ఇచ్చి, వినతిపత్రం తీసుకొని పరిశీలిస్తామని చెప్తాడని, ఏదైనా చేయాలనుకుంటే ప్రధాని మాత్రమే చేయగలడని వ్యాఖ్యానించాడు. జెసి మాటల్లో కూడా వాస్తవం ఉంది. రాజ్యాంగం ప్రకారం మన దేశంలో రాష్ట్రపతి, గవర్నర్లు రబ్బర్‌స్టాంప్‌లు మాత్రమే. కోట్లాదిరూపాయలను ఖర్చుచేసి ఆ వ్యవస్థను నడపాల్సిన అవసరం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇక జెసి వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. దీనికి టిడిపి వారు కూడా గట్టి కౌంటర్‌ ఇస్తూ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌ మంత్రిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs