Advertisement
Google Ads BL

వెంకయ్యా... ఎందుకయ్యా... ఈ రేడియోలు..?


నెల్లూరు జిల్లా వాసి అయిన వెంకయ్యనాయుడు తాజాగా తన జిల్లాకు ఓ ఎఫ్‌ఎం రేడియోను తెస్తున్నానని తెలిపాడు. మంచిదే. ఆయనకి నెల్లూరుకు ఎఫ్‌ఎం రేడియో తేవడం చిన్ననాటి కలంట. ఓకే.. దానికి కూడా ఒప్పుకుందాం..ఆయనే కేంద్రంలో సమాచార, ప్రసార శాఖా మంత్రి కాబట్టి అనుకున్నదే తడవుగా ఎఫ్‌ఎం రేడియోను నెల్లూరుకు ప్రసాదించిన దేవుడాయన. కానీ సోమశిల, కండలేరు వంటి డ్యామ్‌లున్నా, పక్కనే పెన్నానది వంటివి ఉన్న కూడా నెల్లూరులో తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. పారిశుద్ద్యం, దోమలు వంటి ఎన్నో సమస్యలతో నెల్లూరు ప్రజానీకం అల్లాడుతున్నారు.

Advertisement
CJ Advs

స్వయాన కేంద్రమంత్రి వెంకయ్య పట్టణాభివృద్ది, గృహనిర్మాణం వంటి శాఖలను చూస్తున్నాడు. మరోపక్క జిల్లాకే చెందిన మంత్రి నారాయణ మున్సిపల్‌శాఖా మంత్రిగా ఉన్నాడు. తాజాగా సోమిరెడ్డి వ్యవసాయ శాఖను చేపట్టాడు. కానీ నెల్లూరు కార్పొరేషన్‌ తీరు దరిద్రంగా ఉండి, అవినీతి పెరిగిపోతోంది. సాగునీరు, తాగు నీరు లేక ప్రజలు కటకటలాడుతున్నారు. కానీ ప్రజల, రైతుల బాధలను తీర్చేవారే లేరు. కానీ ఈ సోకాల్డ్‌ వెంకయ్య, నారాయణ వంటి వారు ఈ సమస్యలపై దృష్టి సారించకుండా మీడియాను ప్రసన్నం చేసుకుని బుజ్జగించే పనిలో పడ్డారు. జర్నలిస్ట్‌లకు డూప్లెక్స్‌ హౌస్‌లు కట్టిస్తున్నారు.. మంత్రి వర్యులకు, అమాత్యులకు ఇది తగని పని,.. ప్రజాధనాన్ని జర్నలిస్ట్‌లకు లగ్జరీ హౌస్‌ల కోసం ఖర్చుపెట్టి దుబారా చేయడం మంచిది కాదు...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs