Advertisement
Google Ads BL

విశాల్‌ నిర్ణయం అదిరిపోయింది...!


హీరో విశాల్‌ నిర్మాతల మండలి ఎన్నికల్లో విజయపతాకం ఎగురవేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన ప్యానెల్‌ ప్రమాణస్వీకారం చేసింది. పలువురు సీనియర్‌ నిర్మాతల చేతుల మీదుగా ఈ ప్రమాణస్వీకార వేడుక జరపడం హర్షణీయం. ఇక ఈ సందర్భంగా విశాల్‌ నిర్మాతల మండలి తరుపున సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తమిళనాడులో ప్రదర్శిమయ్యే ప్రతి చిత్రం టిక్కెట్‌లోంచి ఓ రూపాయిని కష్టాలలో ఉన్నతమిళరైతులకు ఇస్తామని ప్రకటించాడు. ఈ నిర్ణయం ప్రకారం ప్రతిసినిమా కూడా ఏదో ఒకరోజు అమ్ముడైన టిక్కెట్లలోంచి ఓ రూపాయిని రైతు నిధిగా ఇవ్వాలి. తమకు న్యాయం చేయాలని ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతుల ఖర్చుకు ముందుగా దీనిని ఉపయోగిస్తారు. కాగా ఏ రోజు అనేది తేదీని ప్రకటించాల్సివుంది. ఈ నిర్ణయం మీద తమిళనాడు వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఆ ఒక్క రూపాయిని సినిమా విడుదలైన తొలిరోజే ఇచ్చేలా విశాల్‌ నిర్ణయం తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. దీనిపై విశాల్‌ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాడని సమాచారం. 

Advertisement
CJ Advs

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs