కొంతకాలంగా ప్రజాకవి, విప్లవయోధుడు, ఉద్యమ కెరటం గద్దర్ పవన్‌కు రాజకీయాలలో అండగా నిలువనున్నాడనే వార్తలు వస్తున్నాయి. పవన్ ఏపీతో పాటు తెలంగాణలో కూడా పోటీచేస్తానని ప్రకటించిన నేపథ్యంలో పవన్‌కి గద్దర్ తెలంగాణలో సాయం చేస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ కన్నా గద్దరే ప్రముఖుడు. ఆయన పేరు తెలియని, ఆయన భావజాలం తెలియని తెలంగాణ వ్యక్తి ఉండరనే చెప్పాలి. కానీ తాజాగా గద్దర్ పవన్ విషయంలో నోరు విప్పాడు.
పవన్‌తో తాను ఇప్పటివరకు రాజకీయాల గురించి మాట్లాడలేదని క్లారిటీ ఇచ్చాడు. ఇక తాను 2019లో సొంతగా పార్టీ పెడతానా? లేదా? అనేది పెద్ద ముఖ్యం కాదని తెలిపాడు. పనిలో పనిగా ఉన్న పళంగా పార్టీ పెట్టే కంటే భావసారూప్యత ఉన్న వారిని కలిపి, ఐక్యం చేస్తానని తన ఉద్దేశ్యాన్ని చూచాయగా చెప్పాడు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన వామపక్షాలు, పవన్, కోదండరాం, జెపి వంటి వారిని కలుపుతాడనే వార్తలకు బలం చేకూరింది. మొత్తానికి గబ్బర్‌కి గద్దర్ అండగా నిలిస్తే అది పవన్ అదృష్టమే అవుతుంది. ఎందుకంటే సినీ స్టార్‌గా ఉన్న పవన్ ఇమేజ్‌కు ఇలాంటి ఉద్యమ భావాలు కలిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందనే చెప్పవచ్చు.