తెలుగులో ప్రస్తుతం ఉన్న యువదర్శకుల్లో రచయిత, డైరెక్టర్ బాబికి మంచి టాలెంట్ ఉందని అందరూ ఒప్పుకుంటారు. కానీ ఆయనకు అదృష్టమే కలిసి రాలేదు. 'పవర్'తో యావరేజ్ దగ్గరే ఆగిపోయాడు. కానీ అనుకోని రూపంలో ఆయనకు 'సర్దార్‌గబ్బర్‌సింగ్'కి దర్శకత్వం వహించే అవకాశాన్ని పవన్ ఇచ్చాడు. దాంతో చాలామంది ఆయన అదృష్టాన్ని చూసి కుళ్లుకున్నారు. కానీ ఈ చిత్రం విషయంలో బాబి డమ్మీడైరెక్టర్‌గా మారిపోయాడు. ఆయన పవన్ నియమించిన ఇద్దరు ఘోస్ట్‌లు చెప్పినట్లు, పవన్ జోక్యం ముదరడంతో బాబి ప్రమేయం లేకుండానే ఆ చిత్రం రూపొందింది.
ఈ చిత్రం డిజాస్టర్ అయింది. దీంతో బాబికి ఇకలైఫ్ లేదని కొందరు భావించారు. కానీ 'సర్దార్‌గబ్బర్‌సింగ్' విషయంలో ఆయన నిస్సహాయుడని అందరికీ తెలుసు. దాంతో యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఎంతో మంది దర్శకులను వెతికి, కథలను విని, చివరకు బాబికి ఓటేసి ఆశ్చర్యపరిచాడు. ఈ విషయంలో ఎన్టీఆర్ గట్స్‌ని మెచ్చుకోవాలి. దీంతో బాబి ఎంతో ఆనందంగా ఫీలయ్యాడు. కానీ ఇప్పుడు కూడా 'జై లవ కుశ' విషయంలో కూడా ఆయనకు 'సర్దార్‌గబ్బర్‌సింగ్' పరిస్థితే ఎదురవుతోంది.
ఈ చిత్రం టైటిల్ నుంచి అన్నీ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌ల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. మేకప్ నుంచి అన్ని విషయాలను ఎన్టీఆర్‌తోపాటు సీనియర్ అండ్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ మురళీధరన్‌లే చూసుకుంటున్నారు. మరి ఈ చిత్రం విడుదలైన తర్వాత మరోసారి అందరూ 'అయ్యో..బాబి' అనడం ఖాయమంటున్నారు.