నేడు చాలామంది యువతరం కావాలి..యువతరం ముందుకురావాలి.. అని ఊదరగొడుతూ ఉంటారు. కానీ యువతరం అనే పదానికి ఎవరైనా ఖచ్చితమైన అర్థం చెప్పగలరా? క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, టెన్నిస్ వంటి వారిలో యువ ఆటగాళ్లు అంటే 14 ఏళ్లకే దేశానికి ప్రాతినిధ్యం వహించిన వారి నుంచి అండర్ 17, అండర్19 ఆడేవాళ్లనే ఉద్దేశించి అంటారు. 25 దాటితే సీనియర్ అని వెటరన్ అని పిలుస్తారు. 30 నుంచి 35 వరకు వచ్చేసరికి రిటైర్ అవుతారు. కానీ రాజకీయాలలో, సినిమాలలో యువత అనే పదం చాలా ఫ్యాషన్ అయిపోంది. 50 ఏళ్ల వయసులో కూడా రాజకీయనాయకులను యువనాయకులే అంటుంటారు. ఇక సినిమాలలో అయితే ఈ పదానికి అర్థం ఎప్పుడో మారిపోయింది. యువహీరో రవితేజ అని ఒకప్పుడు రాసేవారు. కానీ సోషల్‌మీడియా విస్తృతమైన తర్వాతనే మన వారిలో మార్పు కనిపిస్తోంది.
సీనియర్ స్టార్స్, యంగ్‌స్టార్స్ అని రాస్తున్నారు. ఇక యంగ్‌స్టార్స్‌లో కూడా పవన్, మహేష్ వంటి వారిని కూడా చేరుస్తున్నారు. కానీ వారిని నేటితరం స్టార్స్ అంటేనే బాగుంటుంది. మోదీ వయసు ఎంత? గత ఎన్నికల్లో మోదీ వంటి యువ నాయకత్వం దేశానికి అవసరమని ప్రచారం చేశారు. ప్రస్తుతం రాహుల్‌గాంధీ వయసు ఎంత? ఆయన యువ ప్రధానిగా రావాలని హోరెత్తిస్తున్నారు. ఇదే భావజాలం మీడియాకు కూడా పాకింది. కాబట్టే ఓ ఆర్టికల్‌లో పవన్ యువనాయకుడు అని భావదారిద్య్రంతో మేము సంబోదించాం.. ఇకనైనా మన మైండ్‌సెట్‌ని మార్చుకుందాం....!