విజయం వచ్చినప్పుడు మరింత బాధ్యత పెరుగుతుంది. కానీ కొందరికి మాత్రం అది అహంకారంగా మారుతుంది. నేటి టిఆర్‌ఎస్ నేతల తీరు ఇలానే ఉంది. వారు గెలవకముందు, రాష్ట్రం విడిపోకముందు ఇచ్చిన హామీలలో పెద్దగా ఫలితాలను చూపించలేకపోతున్నారు. రాష్ట్ర విభజనలో యువత, కోదండరాంతో పాటు ఓయూ విద్యార్ధుల పాత్ర గణనీయం. కానీ వారు కూడా రాష్ట్రంలో పెరిగిపోతున్న దుబారా ఖర్చు, నిరుద్యోగం వంటి వాటిపై మండిపడుతున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందని చెప్పారు.
ఏపీలో బాబు వస్తే జాబు వంటిదే ఆ హామీ, తెలంగాణలో ఇద్దరు ఈ విషయాన్ని చేతల్లో చూపించలేకపోతుండటంతో యువత మండిపడుతోంది.తాజాగా ఇంగ్లీషు మేధావి కే.కేశవరావు అలియస్ కెకె ఓయూలో పూర్వవిద్యార్ధుల సభకు హాజరయ్యాడు. కానీ అక్కడ ఉన్న విద్యార్దులు, యువత ఆయనపై మండిపడ్డారు. తెలంగాణ వస్తే ఉద్యోగం వస్తుందన్నారు? మరి మీకు ఉద్యోగం వచ్చింది కానీ మాకు రాలేదంటూ ఆయన్ను తరిమి తరిమి కొట్టారు.
చివరకు పోలీసులు,గన్‌మెన్ల జోక్యంతో కేకే అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఇక టిఆర్‌ఎస్‌ను తెలంగాణలో వెలగబెట్టలేకపోతున్న ఈ నాయకులు తాజాగా తాము ఏపీలో పోటీ చేసినా కూడా చాలా స్థానాలలో గెలుస్తామని, చంద్రబాబు కేసీఆర్‌లాగా పనిచేయలేకపోతున్నాడని, దీంతో ఏపీ ప్రజలు తీవ్ర అసహనంగా ఉన్నారని వ్యాఖ్యానిస్తున్నారు. కాబట్టి తాము ఏపీలో పోటీ చేసినా పలు స్థానాలలో గెలుస్తామని ప్రకటించుకున్నారు. దీనిని చూస్తే గురువింద గింజ సామెత గుర్తుకొస్తుంది.