వెంకయ్యనాయుడు మాటల మాంత్రికుడైన త్రివిక్రమ్ కంటే గడసరి. మాటలను, ప్రాసలను, అనర్గళ వాగ్దాటిని, పంచ్‌లు, సెటైర్లు వేయడంలో ఆయన్ను మించిన వారు ఎవ్వరూ లేరు. ఇక ఆయన తాజాగా చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణలో వైసీపీ నుంచి టిడిపిలోకి వచ్చి మంత్రి పదవులను దక్కించుకున్నవారిపై ఘాటైన విమర్శలు చేశాడు. అది నైతికం కాదని చెప్పాడు. ఈ విషయంలో వెంకయ్య చెప్పింది అక్షర సత్యం. కానీ తలసాని శ్రీనివాసయాదవ్ టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వెళ్లి మంత్రి పదవి చేపట్టినప్పుడు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు? ప్రస్తుతం కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ ఉంది.
మరి ఈ విషయంలో చట్టం ఎందుకు చేయరు? మరి సురేష్‌ప్రభుని కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నప్పుడు ఈ నీతి వాక్యాలేమయ్యాయి? పార్టీ మార్చిన వారికి రాజీనామా చేయకుండానే మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వారిని అడ్డుకునే హక్కు, మందలించేహక్కు గవర్నర్‌కు ఉన్నాయి. మరి కేంద్రంలోని బిజెపి వారు రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్‌గా ఇలాంటి వాటిని ప్రోత్సహించి మౌనం పాటిస్తున్న నరసింహన్‌ను ఎందుకు ప్రశ్నించడం లేదు? ఈ విషయాలకు వెంకయ్య వద్ద సమాధానం ఉందా?