Advertisement
Google Ads BL

మహేష్‌ బాబు నిజంగానే చెడ్డ పేరుతెచ్చుకుంటాడు!


మహేష్‌బాబుకు ఎంతటి ఫాలోయింగ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఆయన కోలీవుడ్‌లోకి ఎంటర్‌కానున్నాడు. తెలివిగా మురుగదాస్‌ని తీసుకున్నాడు. కానీ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్స్‌ ఇంకా విడుదల కాలేదు. టాలీవుడ్‌లో ప్రత్యేకంగా తనకు ప్రమోషన్‌ అక్కరలేదని భావించి ఆయన తమిళ ఉగాది అయిన ఏప్రిల్‌14న తన కొత్త చిత్రం టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తున్నాడని సమాచారం. ఆయనకు ఆ సలహా ఎవరు చెప్పారో తెలియదు గానీ అదే జరిగితే తెలుగు ప్రేక్షకులను మహేష్‌ అవమానించడమే అవుతుంది. ఆయన తమిళ ప్రేక్షకుల మెప్పుకోసమే జల్లికట్టు ఉద్యమానికి మద్దతు తెలిపి, ప్రత్యేకహోదా విషయంలో మౌనం పాటించాడని ఇప్పటికే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

మరి తమిళ ఉగాదిరోజున ఆయన తన చిత్రం టైటిల్‌, పోస్టర్స్‌ని విడుదల చేస్తే ఈ విమర్శలు మరింత తీవ్రమై, అనవసర వివాదంలో చిక్కుకుంటాడు. ఇక ఈ చిత్రానికి తెలుగు, తమిళ భాషల్లో ఒకే టైటిల్‌ పెట్టాలని మురుగదాస్‌ ఆలోచనలో ఉన్నాడు. కానీ మహేష్‌ చిత్రం పేరు 'స్పైడర్‌' అని ప్రచారం వినిపిస్తోంది. కానీ తెలుగులో ఏ బాషా టైటిల్‌ను పెట్టినా మహేష్‌కు ఇబ్బంది లేదు. ఇక్కడ ఇష్క్‌ అనే హిందీ పదాన్ని, రోగ్‌, ఇడియట్‌ వంటి వాటిని, ప్రేమ ఇష్క్‌ కాదల్‌ అని, స్వచ్చమైన తెలుగుదనంతో చిత్రాలు తీస్తాడనే పేరున్న శేఖర్‌కమ్ముల వంటి వారు 'హ్యాపీడేస్‌, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' వంటి టైటిల్స్‌ని పెట్టినా పట్టించుకోరు. కానీ తమిళ నాడులో మాత్రం తమిళ భాషల్లో టైటిల్స్‌ ఉన్న చిత్రాలకే రాయితీలిస్తారు. కాబట్టి 'స్పైడర్‌' అనే పదం ఆంగ్ల పదం కాబట్టి ఆ టైటిల్‌ను తమిళంలో పెట్టేది అనుమానమే. 

ఇక మహేష్‌ చిత్రాన్ని విడుదల చేసే రోజే సల్మాన్‌ఖాన్‌ 'ట్యూబ్‌లైట్‌' కూడా భారీ ఎత్తున రిలీజ్‌ కానుంది. మహేష్‌ చిత్రాన్ని హిందీలోకి కూడా అనువాదం చేసి విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి అదే జరిగితే ఉత్తరాదిలో 'ట్యూబ్‌లైట్‌' దెబ్బకు మహేష్‌ చిత్రానికి థియేటర్లు కాదు కదా...! ఓపెనింగ్స్‌ కూడా వచ్చేపరిస్థితి లేదు. మరి మహేష్‌ జాగ్రత్త పడకపోతే పవన్‌లా ఓ 'సర్దార్‌గబ్డర్‌సింగ్‌' హిందీ వెర్షన్‌ పరిస్థితే మహేష్‌కు కూడా ఎదురుకావడం ఖాయమంటున్నారు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs