Advertisement
Google Ads BL

రానా చెప్పాడు..అవి ఫ్రెండ్లీ కిస్ లంట..!


నిప్పు లేనిదే పొగరాదు... అలాగే సాక్ష్యాలు బలంగా లేనివన్నీ అబద్దాలు కావు.. సాక్ష్యంలేనిదే నిజం అబద్దం అయిపోదు. ఈ విషయం కుర్రహీరో అయిన రానాకు తెలియవేమో అనిపిస్తోంది. దక్షిణాదిని మరీ ముఖ్యంగా తమిళ పరిశ్రమను సుచీలీక్స్‌ బట్టబయలు చేశాయి. ఇందులో నిందితులుగా ఉన్న వారిలో ఎక్కువ మంది మౌనాన్నే పాటించారు. ఇక రానా, త్రిషలు ముద్దుపెట్టుకునే ఫొటో హల్‌చల్‌ చేసింది. వాస్తవానికి ఈ ఇద్దరి మధ్య ఎఫైర్‌ ఉందని పలు మీడియా సంస్థలు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. వాటికి ఈ ఫొటో కేవలం ఓ ఆధారం మాత్రమే.

Advertisement
CJ Advs

ఇక నేటి రాజకీయనాయకుల నుంచి సినిమా వారి వరకు తప్పులు చేయడం, నోటికొచ్చినట్లు మాట్లాడి దొరికిపోతే తమ పరువు పోకూడదని మీడియా వక్రీకిరించిందని చెప్పడం షరామామూలైపోయింది. ఇక సుచీలీక్స్‌లో రానా. త్రిషను ముద్దుపెట్టుకుంటున్న ఫొటో విషయంలో షరామామూలుగా రానా తప్పుని మీడియా మీదికి నెట్టాడు. అసలు ఆ ఫొటోలు అబద్దమని, సుచీలీక్స్‌ నిజం కాదని, మీడియానే దానిని హైలెట్‌ చేసి హంగామా చేసిందని మండిపడ్డాడు. ఇక నేనలాంటి వాడినా అని మీడియాను ఎదురు ప్రశ్నించాడు. వెంటనే తెలివిగా అవి ఫ్రెండ్లీకిస్‌లు మాత్రమేనని, అలాంటివి చాలా ఉంటాయని భవిష్యత్తులో కూడా తన విషయంలో అలాంటి ఫొటోలు వస్తే నమ్మవద్దన్నట్లుగా ముందరికాళ్లకి బంధం వేశాడు. 

ఇక రానా ఓ ప్లేబోయ్‌ వంటి వాడిని కోలీవుడ్‌, బాలీవుడ్‌ మీడియా ఎప్పటినుంచో చెబుతూనే ఉంది. కానీ టాలీవుడ్‌ మీడియా ఎంతో హుందాగా, ది లెజెండ్‌ రామానాయుడు మనవడిగా, ఎప్పుడూ ఏ విషయంలోనూ, ఇలాంటి చెత్త విషయాలలో ఇరుక్కోని బాబాయ్‌ వెంకటేష్‌, నిర్మాత డి.సురేష్‌బాబుల మీద ఉన్న గౌరవం, ఆ ఫ్యామిలీ మీద చెడ్డపేరు రాకూడదని చూసిచూడనట్లు వదిలేసింది. ఇవ్వన్నీ సినీ ఫీల్డ్‌లో కామనే కదా...! అని పట్టించుకోలేదు. కానీ రానా తన తప్పును మీడియా మీదకి తోశాడు. నేను అలాంటి వాడినా?. అన్నట్లు బిక్కమొహం, అమాయకపు మొహంపెట్టాడు. ఇక అవి ఫ్రెండ్లీ కిస్ లన్నాడు. 

ఇప్పటికే సినిమాలు, మీడియా వల్ల మనదేశంలో పాశ్చాత్యపోకడలు మితిమీరాయి. హాలీవుడ్‌ కల్చర్‌ వస్తోంది. కానీ భారతీయ సంప్రదాయం ప్రకారం స్నేహితులను, అందునా మహిళలను ముద్దుపెట్టుకునే సంస్కృతి మనది కాదు. ఇక్కడ ఉన్నంత వరకు మన దేశ సంప్రదాయాలను గౌరవించాల్సిందే. అంతనా ఇక్కడి పద్దతులు నచ్చకపోతే హాయిగా హాలీవుడ్‌కి వెళ్లిపోయి, అక్కడే చిత్రాలు చేసుకోండి. ఇక్కడ మరో విషయం కూడా గమనార్హం. మన సంప్రదాయాల ప్రకారం ఒక వయసు వచ్చిన తర్వాత కూతురుని కూడా కన్నతండ్రి తాక కూడదు. దూరంగా ఉండాలి. ఇది మన పెద్దలు పెట్టిన నియమం. ఇందులో ఎంతో నిగూడార్ధం ఉంది. 

పాత చిత్రాలలో హీరో, హీరోయిన్ల రొమాన్స్‌ అంటే కేవలం బుగ్గలు, బుగ్గలు ఆనించుకునేవారు. కానీ ఓ మహానటుడు మాత్రం తన ప్రేయసి కంటే తన చెల్లెలి పాత్రను చేసే వారిని కూడా అమాంతం కౌగిలించుకొని, చేతులు ఎక్కడో తాకించి.. ముద్దులు పెడుతూ.. చెల్లి.. అంటూ సిస్టర్‌ సెంటిమెంట్‌ను పడించేవారు. ఆయన చనిపోయారు కాబట్టి ఆయన గురించి మాట్లాడటం ధర్మంకాదు...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs