Advertisement
Google Ads BL

బాలయ్య ఫ్యాన్స్ కి తడిసిపోతున్నాయి..!


ఒకప్పుడు టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన పూరి జగన్నాధ్  ఇప్పుడు మతి లేని సినిమాలు తీసి ప్లాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. 'పోకిరి' తో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పూరి మళ్ళీ అలాంటి సినిమా తియ్యలేకపోయాడు. 'బిజినెస్ మ్యాన్, టెంపర్' తో హిట్ కొట్టినప్పటికీ పూరి మధ్యలో తీసిన చెత్త సినిమాలతో ఉన్న ఆపేరును చెడగొట్టుకున్నాడు. అసలు ఒకే స్టోరీ తో అనేక సినిమాలు తెరకెక్కిస్తూ... ఆ సినిమాలను కూడా హరీబరిగా తీసేసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఇక పూరి పెట్టుకునే టైటిల్స్ కూడా నెగెటివ్ గానే ఉంటాయి. అలాంటి టైటిల్స్ అయితే త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయని అనుకుని ఇలా 'ఇజం, లోఫర్, రోగ్' అంటూ టైటిల్స్ తోనే సగం హిట్ కొడదామని కలలు కంటుంటాడు.

Advertisement
CJ Advs

ఇక తన సినిమాలోని హీరోయిన్స్ ని కూడా అందాల ఆరోబోతలో టాప్ ప్లేస్ లో కూర్చోబెట్టేస్తాడు. అంతలా హీరోయిన్స్ గ్లామర్ ఒలకబొయ్యడం కూడా తన సినిమాకి ప్లస్ అవుతుందని పూరి భావిస్తాడేమో. అసలిప్పుడు ఈ విషయాలన్నీ పక్కన పెడితే పూరి విషయంలో నందమూరి అభిమానుల టెంక్షన్ రోజు రోజుకి ఎక్కువైపోతోంది.ఇలాంటి పిచ్చ కథలతో సినిమాలు తీసే పూరి చేతికి బాలకృష్ణ ఎలా దొరికాడా... అని తెగ భయపడిపోతున్నారు ఫ్యాన్స్. అసలు బాలయ్యకి ఎలాంటి కథ చెప్పి బుట్టలో పడేసాడో అని తెగ మదనపడుతున్నారు.

పూరి గత చిత్రాలను చూసి ఫ్యాన్స్ భయపడి చస్తుంటే ఇప్పుడు పూరి తాజా చిత్రం 'రోగ్' ప్లాప్ ని బట్టి అసలు పూరి - బాలకృష్ణ చిత్రం ఎలా తీస్తాడో అని ఊహించుకుంటుంటేనే నందమూరి అభిమానులకి చెమటలతో బట్టలు తడిసిపోతున్నాయి. ఇప్పటికే వీరి కాంబినేషన్ మీద రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ 'రోగ్' తర్వాత ఈ వార్తలు ఇంకా ఎక్కువైయ్యాయి. చూద్దాం మరి వీరి కాంబినేషన్ మూవీ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో?

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs