అల్లు అర్జున్.. హరీష్ శంకర్ డైరెక్షన్ లో 'డీజే' చిత్రం షూటింగ్ తో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. అయితే ఈ మధ్యన అల్లు అర్జున్ ముఖానికి ఏదో ఎలెర్జి వచ్చిన కారణంగా కొన్ని రోజులు 'డీజే' షూటింగ్ వాయిదా వేశారని ప్రచారం జరిగినప్పటికీ అదేం లేదని చిత్ర యూనిట్ కొట్టి పడేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'డీజే' నుండి అల్లు అర్జున్ తన ఫ్యామిలీ కోసం కొద్దిగా సమయం కేటాయించి గోవా చెక్కేసాడు. అల్లు అర్జున్ ముద్దుల కొడుకు అల్లు అయాన్ బర్త్ డే సందర్భంగా అల్లు అర్జున్ తన భార్య స్నేహ, కూతురు అల్లు అర్హ తో గోవా లో ఎంజాయ్ చేస్తున్నాడు.
కొడుకు అల్లు అయాన్ తో కలిసి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్న ఫోటో తో పాటే భార్య, కూతురు కొడుకు తో దిగిన ఫొటోస్ ని కూడా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇంకా ఆ ఫోటోలతో పాటు 'మా బర్త్ డే బాయ్ అయాన్ తో గోవాలో విహారయాత్ర' అంటూ క్యాప్షన్ కూడా తగిలించాడు. మరి అయాన్ బర్త్ డే ని అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నాడు కదా... ఇక అల్లు అర్జున్ 'డీజే' చిత్రం పూర్తవ్వగానే రైటర్ వంశి డైరెక్షన్ లో 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' చిత్రంలో నటించనున్నాడనే సంగతి తెలిసిందే.