మరో హీరోయిన్ కూడా ఓపెన్ అయ్యింది..!


టాలీవుడ్, కోలీవుడ్, మల్లువుడ్, శాండిల్ వుడ్ అంటూ  తేడా లేకుండా చాలామంది హీరోయిన్స్ సినీ పరిశ్రమలో ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ సంస్కృతి చాలా ఎక్కువని, అవకాశాల కోసం లొంగిపోక తప్పదని డంకా భజాయించి చెబుతున్నారు. రాధికా ఆప్టే దగ్గరనుండి మొదలైన ఈ గొడవ మలయాళ నటి భావన కిడ్నాప్ నుండి మరింత ఎక్కువైంది. తమిళంలో వరలక్ష్మి, తెలుగులో అర్చన, మాధవి లత నిన్నటికి నిన్న సీనియర్ నటి కస్తూరి, తాప్సి వరకు సినిమా అవకాశలకోసం ఎన్నో అవమానాలు తట్టుకుని సినిమా ఇండస్ట్రీలో నిలబడాలని లేకుంటే ఇంటికే అని చెబుతున్నారు.

సినిమా ఇండస్ట్రీపై వారందరూ చేసిన ఆరోపణలని ఇప్పుడు తాజాగా మరో మలయాళ నటి పార్వతి మీనన్ కూడా చేస్తుంది. పార్వతి మీనన్ అంటే ధనుష్‌తో ‘మారియన్‌’, ఆర్య, రానాలతో ‘బెంగళూరు డేస్‌’ వంటి హిట్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. అయితే  తనకి సినిమా ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.  అసలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీపై వస్తున్న ఆరోపణలు అన్ని నిజమే అని కుండ బద్దలు కొట్టింది. సినిమాల్లో అవకాశాలు కావాలంటే వారు చెప్పేది చెయ్యాలని లేకుంటే ఇండస్ట్రీలో ఇక లేకుండా చేస్తారని చెబుతుంది.

మలయాళంలో అవకాశాల కోసం ట్రై చేస్తున్న తనని కొంతమంది హీరోలు, డైరెక్టర్స్ తనని బెడ్ రూమ్ కి రమ్మనే వారని.... అవకాశాలు కావాలంటే ఇలాంటివి ఉండాలని సర్ది చెప్పే ప్రయత్నాలు కూడా చేసేవారని నేను వాటికీ 'నో' చెప్పడంతో నాకు అవకాశాలు లేక ఇక ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతుంది. వాళ్ళు అడిగిన వాటికీ నేను సై అంటే ఇప్పుడు నేను స్టార్ హీరోయిన్ హోదాలో ఉండేదాన్నని చెబుతుంది. ఎపుడో మొదలైన ఈ ఆరోపణలు ఇంకా ఎక్కడికి వెళ్లి ఆగుతాయో గాని ఇప్పుడు మాత్రం సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES