Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..!


యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ చెయ్యడానికి బాగానే గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యలో ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేస్తున్నారంటూ చాలామంది డైరెక్టర్స్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ ఎన్టీఆర్, బాబీ చెప్పిన కథకి కనెక్ట్ అయిపోయి బాబీ డైరెక్షన్ లో సినిమాకి శ్రీకారం చుట్టాడు. బాబీ కాంబినేషన్ లో ఎన్టీఆర్ తన 27 వ చిత్రాన్ని తన అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మాతగా మొదలుపెట్టేసి సెట్స్ మీదకెళ్ళాడు.

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చెయ్యడం... ఈ చిత్రానికి టైటిల్ 'జై లవ కుశ' అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రాశి ఖన్నాని ఎంపిక చెయ్యగా నివేత థామస్ ని రెండో హీరోయిన్ గా సమంత ని లీడింగ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే షూటింగ్ మొదలెట్టినప్పటినుండి ఈ చిత్రం గురించి అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర అధికారిక లోగోను ఈ శ్రీరామ నవమి కానుకగా విడుదల చెయ్యాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట.

ఇదే విషయాన్ని కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ లో తెలియజేశాడు. ఏప్రిల్ 5 శ్రీరామ నవమి సందర్బంగా ఎన్టీఆర్ 27 లోగోను లాంచ్ చేస్తున్నాం అని అభిమానులకు తీపి వార్త అందించాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆగష్టు లో ఈ చిత్ర విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs