చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు తెలంగాణలో టిడిపి తరపున గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవి పొందిన తలసాని శ్రీనివాసయాదవ్‌పై, అలా మంత్రి పదవి ఆయనకిచ్చిన కేసీఆర్‌పై తరచు మండిపడుతుంటారు. రేవంత్‌రెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారంలో దీనినే ఎక్కువగా ప్రశ్నించారు. కానీ హైదరాబాద్ ఓటర్లు ఇచ్చిన తీర్పు సంగతి అందరికీ తెలిసిందే. కాగా గతంలో కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై తలసాని విషయంలో విపరీత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నేడు ఏపీలో చేసింది ఏమిటి?
వైయస్సార్‌సీపీ తరపున గెలిచి, పదవులకు రాజీనామా చేయకుండా టిడిపిలోకి జంప్ అయిన జంప్ జిలానీలకు తన మంత్రి వర్గ విస్తరణలో పెద్ద పీట వేశాడు. దీనిని బట్టి చంద్రబాబు అనే కాదు.. సాధారణంగా రాజకీయ నాయకుల నీతులు కేవలం ఎదుటి వారికే గానీ తమకు వర్తించవని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో చంద్రబాబు మంచి చేశాడా? తప్పు చేశాడా? అని వ్యక్తిగతంగా దూషించడం కంటే రాజకీయ నాయకులకు నైతిక విలువలు లేవని మరోసారి స్పష్టంగా నిరూపితమైందనే చెప్పాలి.