Advertisement
Google Ads BL

డబ్బు సంపాదిస్తూ..సేవ అంటారేంటి..?


నేడు మన సోకాల్డ్‌ స్టార్స్‌ అందరూ ఒకే మాట చెబుతుంటారు. తాము ఓ మంచి చిత్రం కోసం రాత్రింబగళ్లు కష్టపడుతున్నామని, మేమంతా మీ ఆనందం కోసమే అంతలా కష్టపడుతున్నామని, ప్రేక్షకులను, అభిమానులను ఆనందింపజేయడమే తమ లక్ష్యమని పెద్ద పెద్దమాటలు వల్లెవేస్తున్నారు. వారు ఎవరి కోసం కష్టపడుతున్నారు? కేవలం ప్రేక్షకులు, అభిమానుల కోసమేనా? లాభాల కోసం, పారితోషికాల కోసం కాదా? వారేమైనా ప్రేక్షకులకు, డబ్బు లేని వారికి ఉచితంగా వినోదం పంచుతున్నారా? ఫ్రీగా సినిమా టిక్కెట్లు ఇస్తున్నారా? మరి స్వలాభంకోసం, తమ స్వార్థంకోసం చేసే పనికి సేవ, కష్టం అనే పదాలను వాడటం ఎంతవరకు సబబు..? 

Advertisement
CJ Advs

కొందరు తమ వారసులను కళామతల్లి సేవ కోసమే అంకితమిచ్చామని స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం. వినేవారు ఉన్నారని, అడిగే వారు లేరని వారు ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. పోనీ వారేమైనా కళాఖండాలు, లేదా సామాజిక ప్రయోజనం కోసం సినిమాలు తీస్తున్నారా? అంటే అదీ లేదు. మరి వీరు చేసేది సేవ ఎలా అవుతుంది? స్వయాన అమితాబ్‌, షారుఖ్‌ వంటి వారికి పద్మ పురస్కారాలు వచ్చినప్పుడు కూడా వారు చెప్పిన మాటలు వినండి. మేమేమి సేవ చేయడం లేదు. మా వృత్తి మేము చేస్తున్నాం. మాకున్న డిమాండ్‌ మేరకు పారితోషికం తీసుకుంటున్నాం.. మరి మేము ఈ అవార్డులకు అర్హులమేనా? అని ఆలోచించుకుంటున్నామని తెలిపారు. పోనీ మన స్టార్స్‌ రిటైర్‌ అయిన తర్వాత ఎవరికైనా నటనలో... ఇతర విషయాలలో కోచ్‌లుగా, కిటికులు చెబుతూ, కళామతల్లి సేవ చేస్తున్నాం.. అంటే బాగుంటుంది. 

కానీ నేటి స్టార్స్‌ మాత్రం తాము ఎవరి కోసమో రాత్రింబగళ్లు కష్టపడుతున్నామంటున్నారు. ఎంత తప్పు వాదన ఇది. చిరంజీవి మేకప్‌ వేయకుండా  గ్యాప్‌ తీసుకున్న తర్వాత గానీ, రాజకీయాలలోకి ప్రవేశించి సినిమా ఫీల్డ్‌ను వదిలినప్పడుగానీ ఇతరులు సినిమాలు తీయడం మానేశారా? ప్రేక్షకులు చిరంజీవి సినిమాలు, మహేష్‌బాబు సినిమాలు తప్ప చూడం అని భీష్మించుకొని నిరాహారదీక్షలు చేశారా? ఇది కాల ప్రవాహం. ఎవరి కోసం ఏదీ ఆగడు. కాబట్టి ఎవరైనా, చివరకు జర్నలిస్ట్‌లైనా సరే తాము సేవ చేస్తున్నామని అంటే అందరూ నవ్వుకుంటారు. ఎవరి స్వార్థం వారిది... దీనిలో ఎవ్వరినీ తప్పుపట్టకూడదు...!

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs