అమితాబ్‌బచ్చన్‌కి స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్‌లతో పాటు ఎందరితోనే సన్నిహిత సంబంధాలున్నాయి. వారి కుటుంబసభ్యులను, వారి వారసులను కూడా ఆయన గౌరవిస్తారు. ఆయనకు మానవ సంబంధాలు, అనుబంధాల మీద ఎంతో నమ్మకముంది. కాగా నాగార్జున బాలీవుడ్‌లోకి వచ్చిన క్రమంలో కూడా ఆయన పట్టుబట్టి 'ఖుదాగవా' చిత్రంలో నాగ్‌కి రోల్ ఇప్పించాడు. ఆ తర్వాత కూడా నాగ్‌తో ఒక సినిమాతో పాటు పలు వాణిజ్యప్రకటనల్లో నటించాడు. వెంకీ, చిరు వంటి వారు బాలీవుడ్ వెళ్లినప్పుడు కూడా ఆయన వారిని ఎంతగానో ఆదరించాడు. అభిమానించాడు. అంతేకాదు... ఆయన రజనీ, కమల్ వంటి వారిని కూడా ఎంతో ప్రోత్సహించాడు. వర్మకు సపోర్ట్ ఇచ్చాడు. హి ఈజ్ ఏ రియల్ లెజెండ్. ఆయన 'మనం' చిత్రంలో కూడా ఒక చిన్న రోల్ చేశాడు.
ఇక బాలయ్య తాను 'రైతు' చిత్రం చేయాలనుకున్నాడు. కృష్ణవంశీతో కలిసి బాలయ్య అందులోని ఓ కీలకపాత్రను అమితాబ్‌ని చేయమని అడిగాడు. కానీ కాల్షీట్స్‌తోపాటు పలు సంస్థలకు, ప్రభుత్వాలకు బ్రాండ్‌అంబాసిడర్‌గా ఉండటం, క్యాన్సర్‌తో బాధపడుతుండటం.. ఇలా పలు కారణాల వల్ల ఆయన ఆ చిత్రం చేయలేదు. దాంతో బాలయ్య సైతం ఎంతో హుందాగా 'రైతు' చిత్రాన్నే ఆపేశాడు. కానీ ప్రస్తుతం బిగ్‌బి మోహన్‌లాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 600కోట్ల బడ్జెట్తో నిర్మించే చిత్రంలో భీష్ముని తరహా పాత్రను పోషించడానికి ఒప్పుకున్నాడు. భీముని కోణంలో జరిగే కథ ఇది. కాగా ఈ చిత్రాన్ని బిగ్‌బి ఒప్పుకున్న వెంటనే బాలయ్య అభిమానులు రెచ్చిపోతున్నారు. తమ హీరోని అవమానించాడంటున్నారు. కొన్ని మీడియాలలో కూడా ఈ తరహా వార్తలు వస్తున్నాయి. కానీ ఇది చాలా తప్పు. పాత్ర పై డెసిషన్ తీసుకోవాల్సింది నటించే నటుడు కానీ..హీరో అభిమానులు కాదు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది.