Advertisement

'గురు' కు గ్యారెంటీ ఉందా..?


విక్టరీ వెంకటేష్‌ 'గురు' సినిమాకు పాజిటివ్‌ టాక్‌ ఉంది. రివ్య్వూలు సైతం ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. సినిమా బాగుందని పబ్లిక్‌ టాక్‌. కానీ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి? అనే దానిపై ట్రేడ్‌ వర్గాలు సంశయం వ్యక్తం చేస్తున్నారు. సహజంగా వెంకటేష్‌ సినిమా అంటే వినోదం, కుటుంబ నేపథ్యం ఉంటుంది. కాబట్టి కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా చూస్తారు. కానీ 'గురు' మాత్రం అలా కాదు. కేవలం యూత్‌ని టార్గెట్‌ చేసుకుని తీశారు. మార్కెట్లో పవన్‌ కల్యాణ్‌ 'కాటమరాయుడు' మంచి ఊపు మీద ఉంది. సగటు ప్రేక్షకుడు పవన్‌, వెంకటేష్‌ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరినో ఎంపికచేసుకోవాలి. వినోదం, యాక్షన్‌ కావాలంటే 'కాటమరాయుడు'. మంచి కథాబలం ఉన్న సినిమా అంటే 'గురు' చూడాలి. మొదటి రోజు 'గురు'కు వచ్చిన కలక్షన్లను పరిశీలిస్తే సాధారణ ఓపనింగ్‌ కనిపించింది. ఇది మరింత పెరుగుతుందా అనేది వేచిచూడాలి. 

Advertisement

తొలుత 'కాటమరాయుడు' టాక్‌ ఓ మోస్తారుగా ఉండడంతో 'గురు' చిత్రాన్ని వారం ముందుగా రిలీజ్‌ చేశారు. హడావుడి వల్ల కొన్ని చోట్ల ఆశించిన థియేటర్లు లభించలేదని అంటున్నారు. 'కాటమరాయుడు'కు బ్రేక్‌ పడితే మనది సోలో సినిమా అవుతుందని భావించిన డి.సురేష్‌ బాబు లెక్కలు తప్పినట్టే కనిపిస్తోంది. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement