Advertisement
Google Ads BL

రాయ్ లక్ష్మి..అందుకే రెచ్చిపోయిందట..!


ఈ మధ్యన లక్ష్మి రాయ్ హీరోయిన్ గా కంటే ఐటం గర్ల్ గానే ఎక్కువ పేరు కొట్టేసింది. గతంలో హీరోయిన్ గా చేసిన లక్ష్మి రాయ్ కి రాను రాను అవకాశాలు తగ్గడంతో ఐటం వైపు మళ్లింది ఈ భామ. లక్ష్మి రాయ్ పేరును రాయ్ లక్ష్మి గా మార్చుకుని హీరోయిన్ గా  అదృష్టాన్ని పరీక్షించుకుంది. పేరు మార్చుకున్నా ఫలితము లేకుండా పోయింది. అయితే  ఐటం పాపగా అవతారమెత్తాక లక్ష్మి రాయ్ కి తిరుగులేకుండా పోయింది. ఆ ఐటం సాంగ్స్ లో లక్ష్మి రాయ్ తన అందచందాలతో కుర్రకారుకి మతులు పోగొట్టేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు అమ్మడుకి బాలీవుడ్ లో జూలీ 2  లో చేసే అవకాశం వచ్చింది. 2004 లో జూలీ 1  చిత్రం రాగా దానికి సీక్వెల్ గా ఇప్పుడు జూలీ 2  రాబోతుంది. జూలీ 1 లో నేహా ధూపియా అందాల ఆరబోతతో రెచ్చిపోగా, ఇప్పుడు జూలీ 2 లో ఆ అందాల ఆరబోసే పనిని లక్ష్మి రాయ్ తీసుకుంది. ఏ మాత్రం హద్దు అదుపు లేకుండా ఈ చిత్రంలో లక్ష్మి రాయ్ రెచ్చిపోయింది అంటున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆ ఫస్ట్ లుక్ లో లక్ష్మి రాయ్ టాప్ లెస్ లో రెచ్చిపోయింది. ఇక ఫస్ట్ లుక్ లోనే అలా కనబడుతుంటే సినిమాలో ఇంకెలా రెచ్చిపోయిందో రాయ్ లక్ష్మి అని సోషల్ మీడియాలో ఒకటే ప్రచారం జరుగుతుంది.

అయితే ఆ వార్తలకు స్పందించిన లక్ష్మి రాయ్ జూలీ 2  లో నేను చాలా అందంగా కనిపిస్తానని... కథ డిమాండ్ చెయ్యడం వలనే తానూ ఈ చిత్రంలో ఇంత హాట్ గా నటించాననే ముచ్చట చెబుతుంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs