Advertisement
Google Ads BL

బెనిఫిట్‌ షో..మాఫియా ఆటకట్టించాలి..!


నేడు స్టార్‌ హీరోలతో చిత్రాలు తీయడం, సినిమా టాక్‌ ఎలా ఉన్నా ఆ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను, అభిమానుల బలహీనతలను క్యాష్‌ చేసుకొని, టిక్కెట్లను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునే వారిని చూస్తే బాధతో పాటు ఇదో మాఫియాలాగా తయారైందని భయం వేస్తోంది. ఫలానాహీరో చిత్రం మొదటి షోకి ఇంత రేటుకు టిక్కెట్లు అమ్మారు కాబట్టి...దానికి రెట్టింపు రేట్లకు తమ హీరో చిత్రాల రేట్లను నిర్ణయించాలని కొందరు భావిస్తున్నారు. మరోవైపు బెనిఫిట్‌ షోల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు. ప్రీమియర్‌ షోలంటూ కొత్త కొత్తదారులు వెతుక్కుంటున్నారు. అసలు ఏ చిత్రమైనా ఒకే ధరకు టిక్కెట్లను విక్రయించే పరిస్థితులు రావాలి. ఎంత కొత్త సినిమా అయినా ఒక థియేటర్‌లో నాలుగైదు షోలకు మించి వేయడాన్ని అరికట్టాలి. దీంతో తమ పెట్టుబడినంతా మొదటి వారంలోనే లాగేసుకోవాలనే తప్పుడు ఆలోచనలకు స్వస్తి పలకవచ్చు. ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారానే టిక్కెట్లను అమ్మాలి. దీనివల్ల నిర్మాతలకు కూడా లాభమే. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నిర్మాతలను మోసం చేసే విధానానికి తెరపడుతుంది. 

Advertisement
CJ Advs

ఇక ఒకప్పుడు ఎంత పెద్ద హీరో చిత్రం విడుదలైనా కూడా మొదటి రోజు మొదటి షో నుంచే మహిళా ప్రేక్షకులతో పాటు అందరూ థియేటర్లకు వచ్చేవారు. వారి ద్వారా సినిమా బాగుంటే మౌత్‌టాక్‌ బాగా వచ్చేది. అది సినిమా లాంగ్‌రన్‌కి ఉపయోగపడేది. కానీ నేడున్న పరిస్థితుల్లో సామాన్య ప్రేక్షకులు ఓ పెద్దస్టార్‌ చిత్రం విడుదలైన వారం తర్వాత గానీ, టాక్‌ బాగుంటే కానీ తమ ఫ్యామిలీలతో వచ్చి చూసే పరిస్థితులు లేవు. పోలీసులు, కలెక్టర్లు.. ఇతర అధికారులు కూడా మౌనం పాటిస్తున్నారు. ఇంత రేటు ఏమిటి? అని ప్రశ్నిస్తే ఓ నెల ఆగి చూడు.. నిన్నెవ్వరు మొదటిరోజే రమ్మన్నారనే చీదరింపులు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇంత రేటు ఎందువల్ల అని ప్రశ్నిస్తే అభిమానులు చెప్పేది ఏమిటంటే.. మేము మా హీరోకి కటౌట్లు, బేనర్లు, థియేటర్లకి అలంకరణలు, పూలదండల వంటి వాటి సంగతేంటి అంటున్నారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లను అడిగితే మేము ఎంత పెట్టి కొన్నామో మీకు తెలుసా? అనే సమాధానాలు.

ఇక 'కాటమరాయుడు' విషయంలోనే కాదు.. అన్నిచిత్రాల విషయంలో హైదరాబాద్‌లోనే కాదు.. అన్నిచోట్లా బెనిఫిట్‌ షోలను, ఇతర అక్రమ పద్దతులను ప్రభుత్వాలు అరికట్టాలి. చారిటీ పేరుతో దోచుకోవడానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. అంతగా కావాలంటే తమ హీరోలు తీసుకునే గ్రామాల దత్తత, ఇతర కార్యక్రమాలకు, రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహించండి. లేకపోతే 'నో ఎంట్రీ ఫర్‌ కామన్‌ ఆడియన్స్‌' అనే బోర్డులు వేయించండి...! 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs