అన్నా, తమ్ముడి సినిమాల మధ్య బాక్సాఫీస్ కలక్షన్ల అంకెలు దోబూచులాడాయి. అన్న 'ఖైదీ...' సినిమాను తమ్ముడి 'కాటమరాయుడు' కేవలం మూడు రోజుల్లో దాటేశాడు. హీరోగా తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు.
చిరంజీవి నటించిన 'ఖైదీ నెంబర్ 150' చిత్రం వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడానికి ఆరు రోజులు పట్టింది. అది కూడా పక్కాగా ప్లాన్ చేస్తేనే జరిగింది. పవన్ కల్యాణ్ 'కాటమరాయుడు' వంద కోట్ల గ్రాస్‌ను కేవలం 3 రోజుల్లోనే దాటేశాడని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
'కాటమరాయుడు' టాక్‌కి అభిమానుల స్పందనకి మధ్య తేడా ఉంది. పవన్‌ను చూడ్డానికి జనం ఎగబడుతున్నారు. అందుకే వరుసుగా మూడు రోజులు కలక్షన్లతో చెడుగుడు ఆడేశారు. 'ఖైదీ..' సినిమాతో ఎలాంటి సంబంధం లేకున్నా మీడియా ముందు అంకెల చిట్టా విప్పిన అల్లు అరవింద్ ఇప్పుడు 'కాటమరాయుడు' విషయంలో కూడా స్పందిస్తారా? అనేది చూడాలి.