Advertisement
Google Ads BL

ఇకనైనా పవన్ కళ్యాణ్ మారాలి..!


రీమేక్‌లు చేయడం తప్పు కాకపోవచ్చు.. కానీ అది భావదారిద్య్రం. అలాగే పెద్దగా సక్సెస్‌లేని దర్శకులతో, పరభాషా దర్శకులతో చిత్రాలు తీయడం కూడా తప్పు కాదు. కానీ ఆయా చిత్రాలకు లభించే స్పందనను బట్టి మన తీరుతెన్నులను మార్చుకోవాల్సివుంటుంది. పవన్‌కు పైన చెప్పిన రెండు లక్షణాలూ ఉన్నాయి. కానీ 'కాటమరాయుడు' తర్వాతనైనా ఆయన తన వే ఆఫ్‌ థింకింగ్‌పై సమీక్ష జరుపుకోవడం తక్షణావసరం. ఆల్‌రెడీ తెలుగులో డబ్‌ అయిన చిత్రాన్ని, అందునా తమిళంలో పెద్దగా హిట్‌ కాని చిత్రాన్ని డాలీ (ముందు 'ఖుషీ ఎస్‌.జె.సూర్య') చేతిలో పెట్టి హిట్‌ కొడదామనుకున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక రీమేక్‌ వల్ల పవన్‌కి కథా విషయంలో శ్రమ తగ్గి ఉంటే తగ్గుంటుంది. ఇక హిట్‌ డైరెక్టర్‌, సంగీత దర్శకుడు కానంత మాత్రాన మరో ఐదారు కోట్లు మిగిలి వుండవచ్చు. కానీ ఈ తరహా భావనను పవన్‌ పక్కనపెట్టాలని ఆయన శ్రేయోభిలాషులు భావిస్తున్నారు. ఇక త్రివిక్రమ్‌తో ఆయన తన తదుపరి చిత్రం చేయడం ఆనందించదగ్గ విషయం. కానీ ఆ తర్వాత ఎ.యం.రత్నం నిర్మాతగా తమిళ దర్శకుడు నీసన్‌తో 'వేదాలం'ను ఆయన రీమేక్‌ చేయాలని భావిస్తున్నాడు. కానీ 'కాటమరాయుడు' ఫలితం దృష్ట్యా ఇప్పుడు పవన్‌ ఈ విషయంలో కాస్త ఆలోచించుకోవడం అవసరం. ఇప్పటికే 'కాటమరాయుడు' వంటి స్టోరీని వినాయక్‌ లేదా బోయపాటి శ్రీనులైతే అదరగొట్టే వారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన త్రివిక్రమ్‌ తదుపరి చిత్రాన్ని వినాయక్‌కి అప్పగించడం మంచిదంటున్నారు. ఎందుకంటే చిరు 'ఠాగూర్‌' ద్వారా వినయ్‌కి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన టాప్‌ సీనియర్‌ స్టార్స్‌తో ఏమీ వరుస హిట్‌ చిత్రాలు చేయలేదు. 

ఇక చిరు తన ప్రతిష్టాత్మకమైన 150వ చిత్రంగా 'కత్తి' రీమేక్‌ను ఎంచుకుని, దానికి వినయ్‌ని దర్శకునిగా పెట్టుకునే ముందు కూడా ఆయన 'అల్లుడు శీను' వంటి కాస్ట్‌ ఫెయిల్యూర్‌ చిత్రాన్ని, 'అఖిల్‌' వంటి డిజాస్టర్‌ని ఇచ్చాడు. కానీ చిరు తన కథ, దర్శకుని ఎంపికలో పరిణతి చూపి సేఫ్‌ గేమ్‌ ఆడాడు. అదే పద్దతి పవన్‌కి కూడా అవసరం. లేకపోతే నా చిత్రాలు నా ఇష్టం.. ఎలాగైనా తీస్తాను.. చూడమని మిమ్మల్ని బలవంతం చేయడం లేదు కదా...! అన్న వ్యాఖ్యలు చేసిన వర్మ పక్కన పవన్‌ నిలుస్తాడని చెప్పవచ్చు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs